వేటకు సిద్ధమైన రష్మిక.. ఈసారి నెవ్వర్ బిఫోర్ అనేలా..
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న వారిలో రష్మిక టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు.
By: Tupaki Desk | 26 Jun 2025 10:57 AM ISTప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకుంటున్న వారిలో రష్మిక టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో బిగ్ హిట్స్ చూసిన అమ్మడు ఇటీవల కుబేర సినిమాతో మరో బిగ్ హిట్ అందుకుంది. ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమాతో సిద్ధమవుతోంది. అన్‌ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ‘రష్మిక అన్‌లీష్డ్’ అనే ట్యాగ్‌తో నేషనల్ క్రష్ రష్మిక కొత్త రోల్‌లో కనిపించనుందన్న అంచనాలు మొదలయ్యాయి.
ఈ రోజు ఉదయం రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. పొదల మధ్యలో అగ్నితో తగలబడ్డ చెట్టు ఒడిలో నిఖార్సైన యాక్షన్ లుక్‌లో రష్మిక చేతిలో కఠినంగా ఒక ఆయుధం పట్టుకుని నిలబడి ఉంది. ఆమె వెనక జనం టార్చ్‌లతో వెంబడిస్తున్న దృశ్యం ఉన్న పోస్టర్‌లో “హంటెడ్, వుండెడ్, అన్‌బ్రోకెన్” అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఇది పూర్తిగా హీరోయిన్ డ్రైవన్ యాక్షన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది.
రష్మిక ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ, “ఇంతవరకూ నన్ను మీరు చూసింది ఒక ముద్దుగా నవ్వే అమ్మాయిగా మాత్రమే. కానీ ఈసారి నేను చూపించబోయే రష్మిక పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను ఎంతో కష్టపడి చేసిన పాత్ర ఇది. టైటిల్‌ను గెస్ చేస్తే కచ్చితంగా కలుస్తా” అని చెప్పారు. రేపు ఉదయం 10:08కి టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాను అన్‌ఫార్ములా ఫిలిమ్స్ వారు భారీ స్థాయిలో రూపొందించనున్నారు. దర్శకుడు, సాంకేతిక బృందం వివరాలు ఇంకా వెల్లడించలేదు కానీ పోస్టర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇదొక హై ఇంటెన్సిటీ కథగా భావిస్తున్నారు. రష్మిక కెరీర్‌లో ఇది అత్యంత వేరయింట్ షేడ్స్ ఉన్న పాత్ర కావచ్చు. ఆమెకు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేయాల్సి వచ్చిందని సమాచారం.
ఇప్పుడు ఈ అన్‌టైటిల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌తో మరో ప్రయోగానికి ఆమె రెడీ అవుతోంది. ఈ సినిమా టైటిల్ రేపే విడుదల కానున్న నేపథ్యంలో రష్మిక ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కూడా చేస్తోంది. ఇక బాలీవుడ్ లో తామ, కాక్టెయిల్ 2 కూడా లైనప్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
