రష్మికా మందన్నా ఇంట ఉగాది పచ్చడిలా!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా టాలీవుడ్..బాలీవుడ్ కెరీర్ పుల్ స్వింగ్లో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 30 March 2025 2:14 PM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా టాలీవుడ్..బాలీవుడ్ కెరీర్ పుల్ స్వింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. అమ్మడు కొంత కాలంగా పట్టిందల్లా బంగారమే అవుతుంది. చేసిన ప్రతీ సినిమా తో హిట్ అందుకుం టుంది. ఇటీవలే `ఛావా`తో చారిత్రాక విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నటిగా రష్మికలో కొత్త కోణాన్ని బయటకు తెచ్చిన చిత్ర మిది. రొమాంటిక్ పెర్పార్మెర్ గానే కాదు...అంతకు మించి గొప్ప నటిగానూ ఫేమస్ అయింది.
ఈ సినిమా తర్వాత రష్మిక ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగలదు అనే ధైర్యాన్ని ఇచ్చింది. దీంతో మేకర్స్ రష్మికతో ఇంకెలాంటి ప్రయోగాలు చేయోచ్చు? అన్న ఆలోచనలోనూ పడ్డారు. ఈ క్రమంలో రష్మికతో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు కూడా తీయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఓ చిత్రానికి సైన్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆ సంగతి పక్కన బెడితే నేడు ఉగాది సందర్భంగా తన సెలబ్రేషన్ వివరాలు చెప్పుకొచ్చింది.
`మాది కర్ణాటకలోని కొడగు ప్రాంతం. అక్కడ పండగలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తుంటారు. గ్రామాల్లో జనాలంతా ఒకేచోట చేరి సెలబ్రేట్ చేస్తారు. ఉగాది రోజు మేము కూడా పచ్చడి చేస్తాం. కానీ తెలుగు వాళ్ల పచ్చడికి మా పచ్చడికి చిన్న వ్యత్యాసం ఉంది. పుట్నాలు, కొబ్బరి, జీడిపప్పు, పిస్తా, బెల్లం వంటివి మొత్తగా పొడి చేసి అందులో బెల్లం వంటివి పొడి చేసి అందులో మామిడి తురుములు, కిస్ మిస్, వేప పువ్వులు, యాలకులు జోడిస్తాం. దాన్ని మేము బేవు బెల్లా అంటాం.
ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు బలం. నాకు చాలా ఇష్టం. ఆ రోజంతా అదే తింటాను. కొడుగు స్టైల్లో ఇంట్లోనే అందమైన చీర కట్టుకుని కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతా. స్నేహితులకు ఫోన్ చేసి విష్ చేస్తాను. బయటకు మాత్రం వెళ్లను. పండగ వేళ్లలో ఇంట్లో ఉంటోనే ఎంతో సంతోషంగా ఉం టుంది. నటిగా మారిన తర్వాత జీవితమంతా బయటే అయిపోతుంది. కనీసం పండగ సమయాల్లోనైనా ఇంట్లో ఉండాలని స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుని కొన్నాళ్లలే అదే రూల్ పాటిస్తున్నా` అని తెలిపింది.
