Begin typing your search above and press return to search.

రుక్మిణి టాలీవుడ్‌కు మ‌రో ర‌ష్మిక అవుతుందా?

క‌న్న‌డ భామ‌ల‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విష‌యం తెలిసిందే. `ఛలో` మూవీతో టాలీవుడ్‌లోకి ప్ర‌వేశించిన రష్మిక మంద‌న్న వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌తో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.

By:  Tupaki Entertainment Desk   |   12 Feb 2026 12:00 AM IST
రుక్మిణి టాలీవుడ్‌కు మ‌రో ర‌ష్మిక అవుతుందా?
X

క‌న్న‌డ భామ‌ల‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న విష‌యం తెలిసిందే. `ఛలో` మూవీతో టాలీవుడ్‌లోకి ప్ర‌వేశించిన రష్మిక మంద‌న్న వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌తో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకున్న రష్మిక నేష‌న‌ల్ క్ర‌ష్ అనిపించుకుంది. స్వ‌త‌హాగా క‌న్న‌డ అయినా తెలుగు సినిమాల‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వ‌డంతో క‌న్న‌డ ప్రేక్ష‌కులు ర‌ష్మిక‌పై ఫైర్ అయ్యారు.

మాతృ భాష‌కు సంబంధించిన ఇండ‌స్ట్రీని మ‌రిచింద‌ని కామెంట్‌లు చేశారు. ఆ విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొని ఇప్పుడు వ‌న్ ఆఫ్ ది టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరింది. ఇండియా వైడ్‌గా స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా అదే స్థాయిలో పాన్ ఇండియా సినిమాల‌ని ద‌క్కించుకుంటూ య‌మ బిజీగా గ‌డిపేస్తోంది. 2024లో పుష్ప 2తో పాన్ ఇండియా బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని సొంతం చేసుకున్న ర‌ష్మిక అదే హ‌వాని కొన‌సాగిస్తూ గ‌త ఏడాది `చావా`,`కుబేర‌` వంటి హిట్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకుంది.

ప్ర‌స్తుతం కాక్‌టైల్ 2, లేడీ ఓరియెంటెడ్ మూవీ `మైసా`ల్లో న‌టిస్తున్న ర‌ష్మిక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ వ‌ర‌ల్డ్ మూవీలో న‌టించే ఛాన్స్‌ని ద‌క్కించుకుంది. ఇప్పుడు ర‌ఫ్మిక త‌ర‌హాలో మ‌రో క‌న్న‌డ సోయ‌గం రుక్మీణీ వ‌సంత్ న‌డుస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. తెలుగు సినిమాల్లో ర‌ష్మిక పాపుల‌ర్ అయిన‌ట్టుగానే రుక్మిణి కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. రుక్మీణీ వ‌సంత్‌..క‌న్న‌డ నాట మారుమ్రోగుతున్న పేరిది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనూ ఈ పేరు ప్ర‌ధానంగా వినిపిస్తోంది.

కాంతార ప్రీక్వెల్ `కాంతార: చాప్ట‌ర్ 1తో భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న రుక్మిణి ఈ సినిమాతో తెలుగు మేక‌ర్స్ దృష్టిని ఆక‌ర్షించింది. రెండేళ్ల క్రిత‌మే నిఖిల్ తో `అప్పుడో ఇప్పుడో ఎప్పుడో` మూవీ చేసింది. సుధీర్ వ‌ర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టైటిల్‌కు త‌గ్గ‌ట్టే ఎప్పుడొచ్చిందో ఎప్పుడు వెళ్లిందో తెలియ‌కుండానే వెళ్లిపోయింది. దీంతో రుక్మిణి టాలీవుడ్‌ ఎంట్రీ గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌లేదు. `కాంతార:చాప్ట‌ర్ 1` త‌రువాతే టాలీవుడ్ మేక‌ర్ల దృష్టి త‌నపై ప‌డింది. ప్ర‌స్తుతం రుక్మిణి మాస్ ఆఫ్ యాక్ష‌న్ ఎన్టీఆర్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ మూవీ `డ్రాగ‌న్‌`లో న‌టిస్తోంది.

దీన్ని భారీ స్కేల్ లో రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు సినిమాల‌కు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి మార్కెట్ ఉన్న నేప‌థ్యంలో ర‌ష్మిక మంద‌న్న త‌ర‌హాలోనే రుక్మిణి కూడా టాలీవుడ్‌కే ప్రాధాన్య‌తనిస్తుందా? ..లేక క‌న్న‌డలోనూ న‌టిస్తూ రెండు భాష‌ల్లోనూ పాపులారిటీని ద‌క్కించుకోవాల‌ని భావిస్తుందా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.