Begin typing your search above and press return to search.

రష్మిక 'గర్ల్ ఫ్రెండ్'.. అదిరిపోయే అప్డేట్..

అయితే తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇటీవల రష్మిక, దీక్షిత్ పై ఉల్లాసభరితమైన, మనోహరమైన సాంగ్ ను షూట్ చేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   5 July 2025 9:51 PM IST
రష్మిక గర్ల్ ఫ్రెండ్.. అదిరిపోయే అప్డేట్..
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమ్మడు.. రీసెంట్ గా కుబేర మూవీతో మెప్పించారు. మంచి ఇంపాక్ట్ ఉన్న రోల్ లో సందడి చేసిన రష్మిక.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్, మైసా, థామా వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

అయితే ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో రష్మిక కీలక పాత్ర పోషిస్తున్నారు. టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ది గర్ల్ ఫ్రెండ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రముఖ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఆ సినిమాను సమర్పిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జెట్ స్పీడ్ లో చిత్రీకరణను జరుపుతున్నారు మేకర్స్. ఇప్పటికే టాకీ పార్ట్ దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇటీవల రష్మిక, దీక్షిత్ పై ఉల్లాసభరితమైన, మనోహరమైన సాంగ్ ను షూట్ చేశారు మేకర్స్. నాదివే అంటూ సాగుతున్న పాటను హేషమ్ అబ్దుల్ వహాద్ కంపోజ్ చేశారు. ఆయన అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు.

సాంగ్ లోని స్టిల్ ను షాడో ఇమేజ్ రూపంలో పోస్ట్ చేశారు మేకర్స్. అందులో కిర్రాక్ స్టిల్ లో రష్మిక, దీక్షిత్ కనిపించారు. అదే సమయంలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు. మొదటి సింగిల్ త్వరలోనే వస్తుందని చెప్పారు. రొమాన్స్.. రిథమ్.. రా ఎమోషన్ అంటూ రాసుకొచ్చారు.

కాగా, ది గర్ల్ ఫ్రెండ్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్న సంగతి విదితమే. దీంతో రష్మికకు ఉన్న క్రేజ్ బట్టి.. బాలీవుడ్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయాయట. భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మిగతా భాషల్లో కూడా మంచి బిజినెస్ జరుగుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.