రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు..?
నేషనల్ క్రష్ రష్మిక మందన ఏదైనా సినిమా సైన్ చేస్తే చాలు అది సూపర్ హిట్ అనే లెక్క సెట్ చేసుకుంది.
By: Tupaki Desk | 26 May 2025 8:00 AM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన ఏదైనా సినిమా సైన్ చేస్తే చాలు అది సూపర్ హిట్ అనే లెక్క సెట్ చేసుకుంది. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో అమ్మడు చేస్తున్న సినిమాలన్నీ కూడా మంచి ఫలితాలు అందిస్తున్నాయి. అందుకే రష్మిక మందన్న వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారు. ప్రస్తుతం అమ్మడు ధనుష్ తో కుబేర సినిమా చేస్తుండగా ఆ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే రష్మిక లీడ్ రోల్ లో చిలసౌ డైరెక్టర్ రాహుల్ రవింద్రన్ డైరెక్షన్ లో ఒక సినిమా సెట్స్ మీద ఉంది.
ది గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా టీజర్ ఒకటి రష్మిక ఫ్యాన్స్ ని అలరించింది. ఐతే సినిమా మొదలై దాదాపు ఏడాది పైన అవుతున్నా గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ రాలేదు. ఓ పక్క రష్మిక వరుస సినిమాలు కమిట్ అవుతూ వాటిని చేస్తూ వెళ్తుంది. సల్మాన్ తో సికిందర్ సినిమా తర్వాత మరో రెండు ఆఫర్లు అమ్మడి ఖాతాలో చేరినట్టు తెలుస్తుంది. ఇటు టాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యం కాంబినేషన్ మూవీలో రష్మిక హీరోయిన్ ఫిక్స్ అని అంటున్నారు.
రాహుల్ రవింద్రన్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను తన మార్క్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. సినిమా టీజర్ అలరించగా రిలీజ్ ఎప్పుడంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అసలైతే ఈ సినిమా ఈ సమ్మర్ రిలీజ్ అనుకున్నారు కానీ అవుట్ పుట్ మీద మేకర్స్ అంత సాటిస్ఫైడ్ గా లేరన్నట్టు టాక్ వచ్చింది. అందుకే సినిమాకు ఇంకస్త మెరుగులు దిద్ది రిలీజ్ చేస్తారని టాక్.
రిలీజ్ ఎప్పుడన్నది తెలియదు కానీ రష్మిక గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడొచ్చినా ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. ముఖ్యంగా రష్మిక ఫ్యాన్స్ కి ఈ సినిమా ఒక స్పెషల్ జోష్ అందిస్తుందని చెబుతున్నారు. రష్మిక కూడా సోలోగా చేసిన గర్ల్ ఫ్రెండ్ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ప్రస్తుతం సౌత్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో రష్మిక క్రేజ్ గురించి తెలిసిందే. అందుకే గర్ల్ ఫ్రెండ్ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కమర్షియల్ సినిమాతో కాదు రష్మిక అసలైన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఈ సినిమాతో ప్రూవ్ కాబోతుంది.
