Begin typing your search above and press return to search.

రష్మిక.. భయపెట్టే సినిమా కోసం రాత్రుళ్ళు ఇలా..

‘తామా’ చిత్రానికి సంబంధించి మొదటి లుక్ విడుదల కాకపోయినా, రష్మిక పెర్ఫార్మెన్స్ మీద మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   10 April 2025 2:50 PM IST
రష్మిక.. భయపెట్టే సినిమా కోసం రాత్రుళ్ళు ఇలా..
X

నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నా వరుస విజయాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సౌత్ నుంచి నార్త్ వరకూ ఆమెకున్న క్రేజ్ తగ్గడం లేదు. తాజాగా ఆమె హారర్ సినిమాలతో కూడిన ప్రయోగాత్మక కథలవైపు మొగ్గుచూపింది. ఇటీవల బాలీవుడ్ లో ‘ఛావా’ మూవీ హిట్ కావడంతో మంచి ఊపు మీద ఉన్న రష్మిక.. ఈ ఏడాది మరోసారి తన హవా చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో వస్తున్న ‘తామా’ అనే హారర్ ఫిల్మ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.


‘తామా’ చిత్రానికి సంబంధించి మొదటి లుక్ విడుదల కాకపోయినా, రష్మిక పెర్ఫార్మెన్స్ మీద మేకర్స్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ముఖ్యంగా హారర్ నేపథ్యంలో ఆమె పాత్రకు ప్రత్యేకమైన మేకోవర్ ఉండబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘స్త్రీ’, ‘ముంజ్యా’ ఫేమ్ మ్యాడక్ ఫిల్మ్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండడం వల్ల ఈ ప్రాజెక్ట్ పై మార్కెట్‌లో మంచి హైప్ ఉంది. జియో స్టూడియోస్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం కావడంతో బడ్జెట్ పరంగా కూడా గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.

తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక అప్డేట్ షేర్ చేస్తూ షూటింగ్ ప్రస్తుతం నైట్ షెడ్యూల్‌లో జరుగుతోందని తెలిపింది. వచ్చే రెండు రోజుల పాటు కేవలం చంద్రుడిని, కెమెరా లైట్స్‌ని, లేదా ఆకాశంలో కనిపించని నక్షత్రాలను మాత్రమే షేర్ చేస్తానని ఫన్నీగా చెప్పింది. ఈ పోస్టుతో పాటు రష్మిక షేర్ చేసిన చంద్రుడు, చెట్లు ఉన్న అందమైన నైట్ విజువల్ వైరల్ అయింది. దెయ్యనికి సంబంధించిన కథలో ఇలా రాత్రుళ్ళు షూటింగ్ చేయడం క్రేజీగా ఉందని.నెటిజన్స్ కూడా కామేంట్ చేస్తున్నారు.

దర్శకుడు ఆదిత్య సర్పొడార్, సహనటుడు ఆయుష్మాన్ ఖురానా, మరియు అమర్ కౌశిక్‌కి కూడా ఆమె ఈ అప్డేట్ ట్యాగ్ చేసింది. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం కూడా తెలిసింది. ‘తామా’ సినిమాను దివాళీ స్పెషల్‌గా రిలీజ్ చేయబోతున్నారు. అంటే 2025 అక్టోబర్‌లో థియేటర్లలోకి రానుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు హారర్ జానర్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కలగలిపిన సినిమాలంటే మంచి రెస్పాన్స్ ఉంటుంది. అదే తరహాలో ‘తామా’ రూపొందుతోంది.

రష్మిక పాత్రలో చాలా మానసిక ఒత్తిడి, భయం, ఆత్మవిశ్వాసం వంటి భావోద్వేగాలు ఉండబోతున్నాయి అని బీహైండ్ ద స్క్రీన్ సమాచారం. ఇక రష్మిక గత చిత్రాల విషయానికొస్తే, సల్మాన్ ఖాన్‌తో నటించిన ‘సికందర్’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ‘ఛావా’ మూవీలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి టైమ్‌లో ‘తామా’ హిట్ అయితే, ఆమె బాలీవుడ్ కెరీర్‌కు మరోసారి జోష్ పెరుగుతుంది.

ఇప్పటికే పుష్ప 2 వంటి చిత్రాలతో సౌత్ లో కూడా బిగ్ హిట్ అందుకున్న రష్మిక.. ఇప్పుడు హిందీ ఆడియన్స్‌కి హారర్ క్వీన్‌గా కొత్త షేడ్స్ చూపించేందుకు సిద్ధంగా ఉంది. మొత్తానికి ‘తామా’ మూవీ హారర్ మూవీ లవర్స్‌కు తప్పకుండా కొత్త అనుభూతిని అందించబోతోంది. రష్మిక కెరీర్‌లో మరో కీలక మలుపుగా నిలవబోతున్న ఈ సినిమా, దివాళీ బరిలో మంచి విజయాన్ని అందుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి.