నేషనల్ క్రష్ లా ఫేమస్ అయ్యేదెవరు?
బెంగుళూరు నుంచి ముంబై లో ల్యాండ్ అయి బాలీవుడ్ ని ఏల్తోంది దీపికా పదుకొణే. ప్రస్తుతం అమ్మడు అక్కడ నెంబవర్ వన్ రేసులో కొనసాగుతుంది
By: Tupaki Desk | 13 Jun 2025 3:00 PM ISTబెంగుళూరు నుంచి ముంబై లో ల్యాండ్ అయి బాలీవుడ్ ని ఏల్తోంది దీపికా పదుకొణే. ప్రస్తుతం అమ్మడు అక్కడ నెంబవర్ వన్ రేసులో కొనసాగుతుంది. నటుడు రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుని స్థిరపడింది. అంతకు ముందు అదే రాష్ట్రం నుంచి వచ్చిన ఐశ్వర్యా రాయ్ అంతకు మంచి సంచలనమైంది. కొన్నాళ్ల పాటు బాలీవుడ్ ని ఏలింది. అటుపై బాలీవుడ్ లెజెండరీ అమితాబచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ పెళ్లాడి కుటుంబ జీవితంలో పడిపోయింది. ఇలా దీపికా పదుకొణే-ఐశ్వర్యారాయ భారతీయ చిత్ర పరిశ్రమ లో ఎంతో ఫేమస్ అయ్యారు.
ఆ తర్వాత తరం హీరోయిన్లలో అంతగా ఫేమస్ అవుతుంది ఎవరు? అంటే రష్మికా మందన్నా. టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రష్మిక నేడు నేషనల్ క్రష్ గా నీరాజనాలు అందు కుంటుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అంటూ మూడు భాషల్ని దున్నేస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటుంది రష్మిక. బాలీవుడ్ లో లోనూ యానిమల్, ఛావా లాంటి చిత్రాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం అక్కడా మంచి డిమాండ్ ఉంది. ఈ భామ కూడా బెంగుళురు నుంచి దిగుమతైన కన్నడిగే అన్న సంగతి తెలిసిందే.
మరి అదే ప్రాంతం నుంచి నేషనల్ క్రష్ లా ఫేమస్ అవ్వ డానికి ఛాన్స్ ఉన్న భామలు ఎవరు? అంటే ప్రముఖంగా ముగ్గురు భామల పేర్లు తెరపైకి వస్తున్నాయి. శ్రీనిధి శెట్టి, రుక్మిణీ వసంత్, సప్తమీగౌడలకు ఆ ఛాన్స్ కనిపిస్తుంది. కేజీఎఫ్ తో పాన్ ఇండియాలో పరిచయమైంది శ్రీనిధి. ఛాన్సుల పరంగా కొంత గ్యాప్ ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే బిజీ అవుతుంది. ఇటీవలే `హిట్ 3` తో తెలుగులో బాగా ఫేమస్ అవుతుంది. యువతలో ఫాలోయింగ్ పెరుగుతుంది.
`కాంతార` చిత్రంతో సప్తమిగౌడ్ కన్నడ, తెలుగులో సంచలనమైంది. నేచురల్ బ్యూటీగా అలరించింది. ప్రస్తుతం కన్నడలో నటిస్తూనే హిందీ, తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. నితిన్ హీరోగా నటిస్తోన్న `తమ్ము డు`లో ఈ భామ హీరోయిన్. అలాగే రుక్మిణీ వసంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్రాగన్ చిత్రంతో పాన్ ఇండి యా వరల్డ్ లో అడుగుపెడుతుంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కాబట్టి తిరుగుండదు. హిట్ అయితే మంచి పేరొస్తుంది.
`అప్పుడో ఇప్పుడో ఎప్పుడో `అనే తెలుగు సినిమాలో కనిపించినా? అప్పుడు అంతగా ఎవరికీ తెలియలేదు. కానీ `డ్రాగన్` తో రిలీజ్ కు ముందే సంచలనమవుతుంది. హిందీతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తోం ది. ముగ్గురు భామలు మంచి అందగత్తెలే. రష్మికలా చలాకీగా కనిపిస్తారు. అందుకు సక్సెస్ కూడా తోడైతే తిరుగుండదు.
