Begin typing your search above and press return to search.

ఆ భామ‌లిద్ద‌రిలాగే మామ్ లు అంతే క్రేజ్!

ఇదంతా తెర వెనుక జ‌రుగుతుంది కాబ‌ట్టి అమ్మ‌లు అంత‌గా హైలైట్ అవ్వ‌రు. కానీ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా...కిసిక్ బ్యూటీ శ్రీలీల మామ్ లు మాత్రం తెర ముందు కూడా హైలైట్ అవుతుంటారు.

By:  Tupaki Desk   |   12 May 2025 6:30 AM
ఆ భామ‌లిద్ద‌రిలాగే మామ్ లు అంతే క్రేజ్!
X

హీరోయిన్ల‌తో పాటు వాళ్ల త‌ల్లులు కూడా అప్పుడ‌ప్పుడు అన్ సెట్స్ లో క‌నిపిస్తుంటారు. కొంత మంది మామ్ లు అయితే కుమార్తెల‌ను విడిచి ఉండ‌రు. కుమార్తెలు అంటిపెట్టుకునే షూటింగ్ అయ్యేంత వ‌ర‌కూ ఉంటా రు. హీరోయిన్ కు క‌ల్పించే సౌక‌ర్యాలే త‌ల్లుల‌కు కూడా నిర్మాత‌లు క‌ల్పిస్తుంటారు. ఒక్క పారితో షికం అంటే ఇవ్వ‌రు త‌ప్ప మిగ‌తా సౌక‌ర్యాల్లో ఎలాంటి మార్పులుండ‌వ్. హీరోయిన్ గా స్టార్ స్టేట‌స్ వ‌చ్చిన త‌ర్వాత ఇవ‌న్నీ ఉంటాయి.

ఇదంతా తెర వెనుక జ‌రుగుతుంది కాబ‌ట్టి అమ్మ‌లు అంత‌గా హైలైట్ అవ్వ‌రు. కానీ నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా...కిసిక్ బ్యూటీ శ్రీలీల మామ్ లు మాత్రం తెర ముందు కూడా హైలైట్ అవుతుంటారు. క్రేజీ మామ్స్ గా వీళ్లిద్ద‌రికీ మంచి గుర్తింపు ఉంది. ర‌ష్మిక క‌న్న‌డిగా. కానీ ర‌ష్మిక త‌ల్లి కుమార్తెతో పాటు షూటింగ్ ల‌కు హాజ‌రు కారు. కానీ సోష‌ల్ మీడియాలో ఆమె ఫోటోలు మాత్రం వైర‌ల్ అవుతుంటాయి.

ర‌ష్మిక ఫ్యామిలీతో దిగిన ఫోటోల‌ను ముఖ్యంగా మామ్ తో దిగిన ఫోటోలు హైలైట్ అవు తుంటాయి. అందుకు కార‌ణం లేక‌పోలేదు. ర‌ష్మిక అచ్చంగా అమ్మ పోలిక‌ల‌తోనే ఉంటుంది. అమ్మ నోట్లో నుంచి ఊడిప డిన‌ట్లే ఉంటుంది. దీంతో ర‌ష్మిక మామ్ కు సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పేరు సుమ‌న మంద‌న్నా. ర‌ష్మిక మామ్ ను మించి ఈ మ‌ధ్య కాలంలో హైలైట్ అవుతున్నారు శ్రీలీల త‌ల్లి స్వ‌ర్ణ‌ల‌త‌.

గైన‌కాలిస్ట్ ఈమె బెంగుళూరులో ఫేమ‌స్. సొంత ఆసుప‌త్రి ఉండ‌టం స‌హా క‌న్న‌డ సెల‌బ్రి టీలతో స్వ‌ర్ణ ల‌త‌కు మంచి ప‌రిచ‌యాలు, స్నేహాలున్నాయి. అప్పుడ‌ప్పుడు శ్రీలీల‌తో క‌లిసి సినిమా ఈవెంట్ల‌కు హాజ‌ర వుతుంటారు. కుమార్తె చేసిన అల్ల‌రి వీడియోల్లో కూడా స్వ‌ర్ణ‌ల‌త క‌నిపిస్తుంటారు. అలా శ్రీలీ మామ్ కి సోష‌ల్ మీడియాలో క్రేజీగా మారారు. సాధార‌ణంగా హీరోయిన్ల త‌ల్లుల‌ను ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌లేరు. కానీ ర‌ష్మిక‌- శ్రీలీల మామ్స్ ని మాత్రం ఎవ‌రైనా ఇట్టే గుర్తు ప‌డ‌తారు.