Begin typing your search above and press return to search.

రష్మిక స్మోకింగ్ కామెంట్స్.. ఆ క్లిప్ తో నెటిజన్ల ఫుల్ ట్రోల్స్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా స్మోకింగ్ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాను దాన్ని ఏమాత్రం కూడా ప్రోత్సహించనని క్లారిటీ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   2 July 2025 12:30 PM IST
రష్మిక స్మోకింగ్ కామెంట్స్.. ఆ క్లిప్ తో నెటిజన్ల ఫుల్ ట్రోల్స్..
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా స్మోకింగ్ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాను దాన్ని ఏమాత్రం కూడా ప్రోత్సహించనని క్లారిటీ ఇచ్చారు. తాను చేయబోయే ప్రాజెక్ట్‌ ల ఎంపిక విషయంలో కూడా తనకంటూ కొన్ని రూల్స్‌ ఉన్నాయని చెప్పారు. అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు రష్మిక.

సినిమాలోని పాత్రకు అనుగుణంగా స్మోకింగ్ సన్నివేశాల్లో నటించమని ఎవరైనా కోరితే, తాను ఆ ప్రాజెక్ట్ వదులుకోవడానికి కూడా వెనుకాడనని చెప్పారు. ఈ మేరకు వి ద విమెన్ కార్యక్రమంలో స్మోకింగ్ ను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించనని చెప్పుకొచ్చారు. దీంతో ఆమె కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్మిక తీసుకున్న నిర్ణయం మంచిదేనని అనేక మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అ సమయంలో ఆమె ఇప్పటికే ఓ సినిమాలోని స్మోకింగ్ సీన్ లో నటించిన క్లిప్ ను వైరల్ చేస్తున్నారు. ఆ మూవీలో హీరో సిగరెట్ కాలుస్తుంటే.. రష్మిక దాన్ని లాక్కుని తాగుతుంది. దీంతో ఆ సీన్ ను ఇప్పుడు షేర్ చేస్తూ రష్మికను ట్రోల్ చేస్తున్నారు.

అది నిజమైన సిగరెట్ అవునో కాదో తెలియకపోయినా.. స్మోకింగ్ సీన్ లో నటించినట్లే కదా అని అంటున్నారు. ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ అప్పుడు గుర్తు లేదా అని కామెంట్లు పెడుతున్నారు. స్టేట్మెంట్స్ ఇవ్వడానికే బాగుంటాయని.. ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు రష్మిక స్మోకింగ్ కామెంట్ల్ పై ఫుల్ ట్రోల్స్ కనిపిస్తున్నాయి.

ఇక రష్మిక కెరీర్ విషయానికొస్తే.. నేషనల్ క్రష్ ఇప్పుడు స్టార్ అండ్ టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలుతున్నారు. కొంతకాలంగా ఆమె నటిస్తున్న సినిమాలన్నీ మంచి విజయం అందుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. వందల కోట్ల క్లబ్ లోకి కూడా చేరి ఎప్పటికప్పుడు సత్తా చాటుతున్నాయి.

రీసెంట్ గా కుబేర మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు రష్మిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. తన నటనతో మెప్పించారు. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్, మైసా, థామా లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి హిట్స్ ను సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.