Begin typing your search above and press return to search.

రష్మిక 'నో' చెప్పకుంటే కష్టమే..!

అలాంటి క్రేజ్‌ను దక్కించుకున్న రష్మిక మందన్న ఇటీవల సల్మాన్‌ ఖాన్‌తో నటించిన 'సికిందర్‌' సినిమాతో వచ్చింది.

By:  Tupaki Desk   |   19 April 2025 8:30 AM
Rashmika Sikandar Movie Flop Impact
X

నేషనల్‌ క్రష్ రష్మిక మందన్న కెరీర్‌ ప్రస్తుతం పీక్స్‌లో ఉంది. యానిమల్‌, పుష్ప 2, ఛావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఆ మూడు సినిమాలతో రెండేళ్ల కాలంలో రష్మిక ఏకంగా రూ.3300 కోట్ల వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. మరే హీరోయిన్‌కి ఈ రికార్డ్‌ సాధ్యం కాలేదు, భవిష్యత్తులో అయినా సాధ్యం కాకపోవచ్చు. అలాంటి క్రేజ్‌ను దక్కించుకున్న రష్మిక మందన్న ఇటీవల సల్మాన్‌ ఖాన్‌తో నటించిన 'సికిందర్‌' సినిమాతో వచ్చింది. సల్మాన్‌ ఖాన్‌తో నటించడం తన డ్రీమ్‌ అంటూ ప్రమోషన్స్‌ సమయంలో చెప్పుకొచ్చిన రష్మిక మందన్న ఫలితం తర్వాత ఏం అంటుంది అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.

సికిందర్‌ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా రష్మిక నటించడంను చాలా మంది తప్పుబట్టారు. ఇద్దరి మధ్య వయసు తేడా చాలా ఉంది. ఇలాంటి కాంబినేషన్‌లను ఎలా ఆధరిస్తారు, ప్రేక్షకులు ఎలా ఇలాంటి వారి సినిమాలను చూస్తారు అంటూ కొందరు ట్రోల్‌ చేశారు. ఆ సమయంలో సల్మాన్‌ ఖాన్‌, రష్మిక మందన్న కూడా స్పందించారు. తాను సల్మాన్‌ ఖాన్‌తో నటించే అవకాశం దక్కించుకున్నాను అంటే కచ్చితంగా నేను పెద్ద విజయాన్ని సాధించినట్లే అంది. సల్మాన్‌ ఖాన్‌ గత దశాబ్ద కాలంగా ఫామ్‌ లేక కొట్టు మిట్టాడుతున్నాడు. ఆ విషయం రష్మిక కి తెలియనిది కాదు. అయినా కూడా రష్మిక సికిందర్ సినిమాకు ఓకే చెప్పడానికి కారణం మొహమాటం అయి ఉంటుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

రష్మిక మందన్న కేవలం 'నో' చెప్పలేక పోవడం వల్లే సికిందర్ ప్లాప్‌ను నేడు మోయాల్సిన పరిస్థితి వచ్చిందని, వరుస విజయాలతో వెళ్తున్న రష్మికకి ఆ ఫ్లాప్‌ కచ్చితంగా గట్టి ఎదురు దెబ్బ అనే టాక్‌ వినిపిస్తుంది. వరుస విజయాలు దక్కించుకున్న రష్మిక మందన్న సినిమాల ఎంపిక విషయంలో మొహమాట పడితే కచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్టార్‌ హీరో సినిమా అని, ప్రముఖ బ్యానర్‌ అని, పెద్ద దర్శకుడు అని కథ వినకుండా, పాత్రకు ప్రాముఖ్యత లేకుండా సినిమాలు చేస్తే కచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది. ఆ విషయాన్ని రష్మిక మందన్న గుర్తించకుంటే కచ్చితంగా ఇమేజ్‌కి డ్యామేజీ తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం రష్మిక నటించిన 'కుబేరా' సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మరో వైపు గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా సైతం రెడీ అవుతోంది. ఇక హిందీలో ఈమె థామా అనే సినిమాను సైతం కమిట్ అయింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. హిందీలో రాణించాలంటే గ్లామర్‌ షో ఒక్కటి సరిపోదు, కమర్షియల్‌ విజయాలు దక్కడంతో పాటు నటనతో మెప్పించాల్సి ఉంటుంది. సికిందర్‌ వంటి సినిమాల్లో నటిస్తే రష్మిక మందన్న కెరీర్‌ బాలీవుడ్‌లో బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రష్మిక ఇకపై అయినా కథ నచ్చని సినిమాలకు, పాత్రకు ప్రాముఖ్యత లేని సినిమాలకు నో చెప్పడం నేర్చుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నో చెప్పకుండా మొహమాటంతో ఓకే చెప్తే కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.