Begin typing your search above and press return to search.

అందాల రష్మిక.. చీర ఎవరిచ్చారు? పిక్స్ ఎవరు తీశారు?

హీరోయిన్ రష్మిక మందన్న ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. రకరకాల ఔట్ ఫిట్స్ లో ఫోటోలు దిగి సందడి చేస్తుంటారు.

By:  Tupaki Desk   |   29 May 2025 12:35 PM IST
అందాల రష్మిక.. చీర ఎవరిచ్చారు? పిక్స్ ఎవరు తీశారు?
X

హీరోయిన్ రష్మిక మందన్న ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. రకరకాల ఔట్ ఫిట్స్ లో ఫోటోలు దిగి సందడి చేస్తుంటారు. అటు ట్రెడిషనల్.. ఇటు మోడ్రన్ గా అలరిస్తుంటారు. రీసెంట్ గా ఆనంద్ దేవరకొండ సినిమా లాంచ్ ఈవెంట్ కు పసుపు, ఎరుపు, ఆరెంజ్ కలర్స్ ఉన్న చీరలో అటెండ్ అయ్యారు.

ఆ తర్వాత అదే చీరతో దిగిన పిక్స్ ను షేర్ చేశారు రష్మిక. రకరకాల పోజులు ఇచ్చారు. అదే సమయంలో ఆమె ఇచ్చిన క్యాప్షన్ హాట్ టాపిక్ గా మారింది. "ఈ పిక్స్ లో నాకు ఇచ్చినవి, విలువైనవి అన్నీ ఉన్నాయి. ఇష్టమైన 3 రంగుల చీర, అది ఇచ్చిన స్పెషల్ లేడీ, ఫోటో తీసిన వ్యక్తి, ఇష్టమైన ప్లేస్ అన్నీ ఉన్నాయి" అని క్యాప్షన్ ఇచ్చారు.

దీంతో ఇంకేముంది.. రష్మిక పిక్స్ తో మరోసారి ఆమె లవ్ మ్యాటర్ పై చర్చ ఊపందుకుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటి వరకు ఇద్దరిలో ఎవరూ దానికి అంగీకరించలేదు. ఫ్రెండ్స్ అనే చెబుతుంటారు. అయినా అంతా లవర్స్ అని ఫిక్సయ్యారు.

అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అదే సమయంలో రీసెంట్ గా రష్మిక.. సోఫాపై కూర్చుని పిక్స్ దిగారు. అదే ప్లేస్ లో ఇప్పటికే విజయ్, రష్మిక, దర్శకుడు పరశురామ్ దిగిన పాత పిక్ వైరల్ గా మారింది. దీంతో రష్మిక.. విజయ్ ఇంట్లోనే పిక్స్ తీసుకున్నారని క్లియర్ గా తెలుస్తోంది. అంతే కాదు ఆయనే తీసి ఉంటారని నెటిజన్లు చెబుతున్నారు.

ఆ చీర కూడా విజయ్ మదర్ ఇచ్చి ఉంటారని అనుమానపడుతున్నారు. వారిద్దరూ ప్రేమలో ఉండటం నిజమేనని అంటున్నారు. ఇంకెప్పుడూ చెబుతారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటికే లేటైంది.. చెప్పండి అని అడుగుతున్నారు. మొత్తానికి రష్మిక పోస్ట్ చేసిన పిక్స్ అండ్ క్యాప్షన్ మరోసారి లవ్ కహానీ కోసం మాట్లాడేలా చేశాయని చెప్పాలి.

కాగా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఫస్ట్ టైమ్ గీతా గోవిందం మూవీలో నటించారు. అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీ కోసం మరోసారి జతకట్టారు. అలా వారి కాంబినేషన్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. వారంతా రీల్ కపుల్.. రియల్ కపుల్ గా మారాలని కోరుకుంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.