అక్కడా నేషనల్ క్రష్ మార్క్ పడుతుందా!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా `ఛావా వరకూ వరుస విజయాలతో ఎదురు లేకుండా దూసుకుపోయింది. పాన్ ఇండియానే షేక్ చేసే సక్సెస్ లు బ్యాక్ టూ బ్యాక్ అందుకుంది.
By: Tupaki Desk | 12 April 2025 11:30 AM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా `ఛావా వరకూ వరుస విజయాలతో ఎదురు లేకుండా దూసుకుపోయింది. పాన్ ఇండియానే షేక్ చేసే సక్సెస్ లు బ్యాక్ టూ బ్యాక్ అందుకుంది. ఇదే ఊపులో మరిన్ని సక్సెస్ లు అందుకుంటుందని అభిమానులు భావించారు. కానీ `సికిందర్` రూపంలో ఒక్క సారిగా రష్మిక స్పీడ్ కి బ్రేకులు పడ్డాయి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సికిందర్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయినా ఒక్క వైఫల్యం రష్మికని డిసైడ్ చేసేది కాదు.
ఆ ప్రభావం పెద్దగా రష్మిక కెరీర్ పై పడేది కాదు. కానీ డబుల్ హ్యాట్రిక్ లైనప్ ని మిస్ అవ్వాల్సి వచ్చింది. ఆ సంగతి పక్కనబెడితే? ప్రస్తుతం అమ్మడి చేతిలో చాలా సినిమాలున్నాయి. తెలుగు, హిందీలో చాలా సినిమాలు చేస్తోంది. అందులో తొలిసారి హారర్ జోనర్ చిత్రం కూడా ఒకటి ఉంది. ఆదిత్య సర్పోత్దార్ తెరకెక్కిస్తోన్న `థామా`లో రష్మిక నటిస్తోంది. హారర్ కామెడీ నేపథ్యంగల చిత్రమిది. దినేష్ విజన్ హారర్ ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతున్న చిత్రమిది.
సినిమాపై అంచనాలు భారీగా ఉన్నా యి. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. నైట్ షూట్ సన్నివేశాలు జరుగుతున్నాయి. ఇందులో రష్మిక కూడా పాల్గొంటుంది. ఇప్పటి వరకూ రష్మిక హారర్ సినిమాలు చేయ లేదు. తెలుగులో చాలా సినిమాలు చేసింది. కానీ హారర్ లో నటించే ఛాన్స్ మాత్రం తొలిసారి హిందీలోనే వచ్చింది. దీంతో రష్మిక పాత్ర ఎలా ఉంటుంది? పాత్రలో ఆమె ఆహార్యం ఎలా ఉంటుంది? అన్న దానిపై ఆసక్తి నెలకొంది.
ఈ నేపథ్యంలో రష్మిక రిస్క్ తీసుకుంటుందా? అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. హారర్ జానర్ సినిమాలకు సక్సస్ రేట్ చాలా తక్కువ. హిట్ అయితే తిరుగుండదు. వసూళ్లతో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ప్లాప్ అయితే విమర్శలు కూడా అదే స్థాయిలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి రష్మిక ఎంట్రీ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. దీపావళికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
