ఇంటికెళ్లి ఏడాదిన్నరవుతుంది
నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న రష్మిక భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తున్నారు.
By: Tupaki Desk | 7 July 2025 2:00 PM ISTనేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న రష్మిక భాషతో సంబంధం లేకుండా పలు సినిమాల్లో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ గా కెరీర్ లో ముందుకెళ్తున్న రష్మిక రీసెంట్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేర సినిమాలో ధనుష్ తో కలిసి నటించి, ఆ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ను అకౌంట్ లో వేసుకున్నారు.
కెరీర్ పరంగా సూపర్ ఫామ్ లో ఉన్న రష్మిక ఓ విషయంలో ఎంతో బాధ పడుతున్నట్టు తెలిపారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మీ హాలీడేస్ ను ఎలా ఎంజాయ్ చేస్తారనే ప్రశ్న రష్మికకు ఎదురవగా దానికి సమాధానమిచ్చిన రష్మిక తన మనసులోని బాధను బయటపెట్టారు. వీకెండ్ హాలీడే కోసం ఏడుస్తానని, తనకు ఓ చెల్లి ఉందని, ఇప్పుడు తనకు 13 సంవత్సరాలని, తన కెరీర్ మొదలైనప్పటి నుంచి చెల్లిని సరిగా చూసుకోలేకపోతున్నానని రష్మిక వెల్లడించారు.
ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు తన చెల్లి విషయంలో చాలా బాధగా ఉందని, గత ఏడాదిన్నరగా తాను ఇంటికి వెళ్లలేదని, తన సొంత ఊరిని కూడా మిస్ అవుతున్నానని, ఫ్రెండ్స్ ను చూడలేదని, ఇంతకుముందు ఫ్రెండ్స్ ఏదైనా టూర్ కు వెళ్తే తనను కూడా జాయిన్ చేసుకునేవారని, కానీ టైమ్ ఉండటం లేదని ఇప్పుడు తనకు చెప్పడం కూడా మానేశారని బాధ పడుతున్నారు రష్మిక మందన్నా.
తన తల్లి తనకెప్పుడూ ఓ విషయం చెప్పేవారని, ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అవాలంటే పర్సనల్ లైఫ్ ను త్యాగం చేయాలని, పర్సనల్ లైఫ్ బావుండాలనుకుంటే కెరీర్ లో కొన్ని త్యాగం చేయాలని చెప్పారని, కానీ తాను రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్టు రష్మిక చెప్పారు. కాగా ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో థామా తో పాటూ తెలుగులో ది గర్ల్‌ఫ్రెండ్, మైసా అనే సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
