Begin typing your search above and press return to search.

ర‌ష్మిక వాలు జ‌డ- జారు ముడి క‌థేంటో కానీ..!

మ‌రోవైపు ర‌ష్మిక హిందీ-తెలుగులో వ‌రుస ప్రాజెక్టుల‌కు క‌మిట‌వుతూ ఫుల్ బిజీగా ఉంది.

By:  Tupaki Desk   |   1 Oct 2024 3:30 AM GMT
ర‌ష్మిక వాలు జ‌డ- జారు ముడి క‌థేంటో కానీ..!
X

అందాల క‌థానాయిక ర‌ష్మిక మంద‌న్న త‌దుప‌రి పుష్ప 2లో శ్రీ‌వ‌ల్లి పాత్ర‌తో మ్యాజిక్ ని రిపీట్ చేసేందుకు దూసుకొస్తోంది. పుష్ప రాజ్ ప్రేమికురాలు శ్రీ‌వ‌ల్లిగా అద్భుత‌మైన ఫాలోయింగ్ ని తెచ్చుకున్న ర‌ష్మిక‌, ఆ వెంట‌నే యానిమ‌ల్ లోను ర‌ణ‌బీర్ భార్య‌గా అద్భుత న‌ట‌నతో క‌ట్టి ప‌డేసింది. ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక‌కు ఉత్త‌రాదినా భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. చాలా మంది సీనియ‌ర్ హీరోయిన్లు సాధించ‌లేనిది ర‌ష్మిక చాలా సులువుగా సాధించి ల‌క్కీ గాళ్ అని నిరూపించింది. మ‌రోవైపు ర‌ష్మిక హిందీ-తెలుగులో వ‌రుస ప్రాజెక్టుల‌కు క‌మిట‌వుతూ ఫుల్ బిజీగా ఉంది.


ప్ర‌స్తుతం ఏ.ఆర్ మురుగ‌దాస్ - స‌ల్మాన్ కాంబినేష‌న్ మూవీ సికంద‌ర్ లో న‌టిస్తోంది. ఈ మూవీ మ‌రో పాథ్ బ్రేకింగ్ హిట్ అవుతుంద‌ని ర‌ష్మిక ఆశిస్తోంది. కెరీర్ మ్యాట‌ర్ అటుంచితే ర‌ష్మిక సోషల్ మీడియాల్లో నిరంత‌రం త‌న అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు అద్భుత‌మైన ఫోటోషూట్ల‌ను ఈ భామ షేర్ చేస్తోంది.

తాజాగా ర‌ష్మిక సాంప్ర‌దాయ‌బ‌ద్ధమైన డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించింది. బ్యాక్ లెస్ లుక్.. జారు ముడి వేసిన బ్లౌజ్ అందాన్ని ఎలివేట్ చేసింది. అలాగే త‌న అంద‌మైన వాలుజ‌డ‌ను అంతే అందంగా ప్ర‌ద‌ర్శించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. యువ‌త‌రం వాట్సాపుల్లోనూ వేగంగా వైర‌ల్ అయింది. శ్రీ‌వ‌ల్లినా మ‌జాకానా? అంటూ యూత్ కిరాక్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.