నేషనల్ క్రష్ ఐటం గాళ్!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా నేడు పాన్ ఇండియా రేంజ్ ని ఆస్వాదిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది.
By: Tupaki Desk | 18 July 2025 8:30 AM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా నేడు పాన్ ఇండియా రేంజ్ ని ఆస్వాదిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. తెలుగు, తమిళ్, హిందీలో తిరుగులేని నటి గా కొనసాగుతుంది. అత్యధిక పారితోషికం తీసు కుంటోన్న నటిగానూ సంచలనమవుతోంది. సక్సెస్ లో తానో రోల్ మోడల్ గాను మారుతోంది. రష్మిక ఈ స్థాయికి చేరుకోవడంలో తన ప్రతిభ ఎంతో కీలకమైందో? అంతకు మించి గొప్ప అదృష్టవంతురాలు కావడంతోనే అన్నది అంతే వాస్తవం. ఈ విషయాన్ని రష్మిక అంతే ఓపెన్ గానూ ఒప్పుకుటుంది.
అలాగే సోలో నాయికగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతుంది. ఇప్పటికే తెలుగులో ఓ లేడీ ఓరియేంటెడ్ చిత్రం చేస్తోంది. ఇలాంటి అవకాశాలు ఇంకా వస్తున్నా? ఆచితూ చి అడుగులు వేస్తోంది. పాన్ ఇండియా వైడ్ ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుం టోంది. మరి ఇలాంటి తరుణంలో రష్మిక కూడా ఐటం గాళ్ల్ గా టర్న్ అయితే ? ఆ పీక్స్ మామూలుగా ఉండదు.
నిజంగా రష్మిక నర్తకిగా మారితే గనుక ఐటం గాళ్ల్ గా పారితోషికం అందుకోవడంలో టాప్ ప్లేస్ లో కొనసా గుతుంది. అమ్మడికి ఉన్న పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని నెత్తిన కోట్ల రూపాయలు గుమ్మ రిస్తారు. `సామీ సామీ` అంటూ మొదటి భాగంలో....`ఫీలింగ్స్` అంటూ పుష్ప రెండవ భాగంలో ఇండియానే కాదు ఇతర దేశాల్ని సైతం షేక్ చేసింది. అలాంటి నటి? ఐటం పాటలో నటిస్తే ఆట మాములుగా ఉండదుగా.
కానీ ఆ ఛాన్స్ రష్మిక ఇప్పుడే తీసుకునే అవకాశం లేదు. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తు తం హీరోయిన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. స్టార్ హీరోలే అమ్మడితో నటించడానికి క్యూలో ఉన్నారు. మరో నాలుగైదేళ్ల పాటు రష్మిక హవా కొనసాగుతుంది. అంత వరకూ ఎలాంటి ఢోకాలేదు. ఆ తర్వాతే రష్మిక నుంచి కొత్త నిర్ణయాలు ఆశించే అవకాశం ఉంటుంది.
