Begin typing your search above and press return to search.

860 కోట్ల బ‌డ్జెట్ సినిమాలో ర‌ష్మిక‌

ఇటీవ‌లి కాలంలో 200 కోట్ల నుంచి 300 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన సినిమాల్లో న‌టించింది ర‌ష్మిక మంద‌న్న‌.

By:  Tupaki Desk   |   19 May 2025 8:09 PM IST
860 కోట్ల బ‌డ్జెట్ సినిమాలో ర‌ష్మిక‌
X

ఇటీవ‌లి కాలంలో 200 కోట్ల నుంచి 300 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన సినిమాల్లో న‌టించింది ర‌ష్మిక మంద‌న్న‌. యానిమ‌ల్‌, పుష్ప 2, చావా లాంటి చిత్రాలు ఈ స్థాయి బ‌డ్జెట్ల‌తో రూపొందించిన‌వే. కానీ ఇప్పుడు ఏకంగా 860 కోట్ల (100 మిలియ‌న్ డాల‌ర్లు) బ‌డ్జెట్ తో రూపొందించిన వాల్ట్ డిస్నీ `లిలో అండ్ స్టిచ్‌` ప్రాజెక్ట్ లో ర‌ష్మిక భాగ‌మైంది. ఇప్పుడు ర‌ష్మిక అంత‌ర్జాతీయంగా ఫేమ‌స్ కాబోతోంది.

కెరీర్ ప్రారంభించిన కేవ‌లం నాలుగైదేళ్ల‌లోనే టాలీవుడ్ లో అగ్ర క‌థానాయికగా ఎదిగేసిన ర‌ష్మిక‌, ఆ త‌ర్వాత బాలీవుడ్ లోను పాపుల‌ర్ హీరోల‌తో న‌టించింది. ఇటీవ‌లే బ్యాక్ టు బ్యాక్ యానిమ‌ల్, పుష్ప 2, చావా లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించి ల‌క్కీ ఛామ్ గా మారింది. పుష్ప 1800 కోట్లు వ‌సూలు చేయ‌డం ఒక సెన్సేష‌న్ కాగా, యానిమిల్, చావా 800 కోట్లు పైగా వ‌సూలు చేసాయి.

అందుకే ఇప్పుడు డిస్నీ సంస్థ `లిలో అండ్ స్టిచ్` ప్ర‌మోష‌న్స్ కోసం ర‌ష్మిక‌ను ఫ్రంట్ ఫేస్ గా ఎంపిక చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ చిత్రం 23 మే 2025న థియేటర్లలోకి రానుంది. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్టాలో రష్మిక ఒక ఎగ్జ‌యిటింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో గ్రహాంతర స్నేహితురాలు స్టిచ్ కోసం లిలోగా ర‌ష్మిక‌ రూపాంతరం చెందింది. భార‌త‌దేశంలో ర‌ష్మిక ఈ సినిమాని ప్రమోట్ చేయనుంది. ఈ సినిమా ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో విడుదల కానుంది. ఇది 2D- 3D ఫార్మాట్లలో అందుబాటులో ఉంటుంది. డీన్ ఫ్లీషర్ క్యాంప్ దర్శకత్వం వహించిన లిలో & స్టిచ్ భార‌త‌దేశంలోను మంచి బజ్‌ను సృష్టించింది. ఇప్పుడు అందరి దృష్టి భారతీయ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాధించే విజ‌యంపైనే. ఈ సినిమాని 100 మిలియ‌న్ డాల‌ర్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించ‌గా, 200 మిలియ‌న్ డాల‌ర్లు పైగా వ‌సూలు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించిన‌ట్టు. కేవ‌లం భార‌త‌దేశం నుంచి ఈ సినిమా ఎంత మొత్తం వ‌సూలు చేయ‌నుందో వేచి చూడాలి. ర‌ష్మిక ప్ర‌య‌త్నాలు చూస్తుంటే, హాలీవుడ్ కి జంప్ అవుతుందా? అంటూ అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.