Begin typing your search above and press return to search.

రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ కి బంపర్ ఆఫర్..!

ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే రష్మిక ఉన్న ఫాం చూసిన హిందీ మేకర్స్ ఆమె నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను భారీ మొత్తానికి కొనేశారట.

By:  Tupaki Desk   |   29 Jun 2025 9:00 AM IST
రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ కి బంపర్ ఆఫర్..!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా కుబేర తో మరో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. కుబేర సినిమాలో రష్మిక రోల్ చాలా ఎక్కువ రన్ టైం తో ఉన్నా కూడా ఆమె ఇంపాక్ట్ సినిమా అంతా ఉంది. అందుకే రష్మిక ఈ సినిమా సక్సెస్ లో భాగమైంది అన్నట్టుగా చెప్పొచ్చు. అదీగాక రష్మిక సినిమాలో ఉంటో లక్ కలిసి వస్తుంది అన్నది మరోసారి కుబేరాతో ప్రూవ్ అయ్యింది. కుబేర సినిమా తెలుగులో సూపర్ హిట్ కాగా కోలీవుడ్ లో ఆశించిన రేంజ్ రీచ్ అందుకోలేదు.

ఇదిలా ఉంటే రష్మిక కుబేర హిట్ అవ్వడంతో ఆమె చేస్తున్న నెక్స్ట్ సినిమాల మీద ఆ ఎఫెక్ట్ ఉంది. రష్మిక ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ గా నటిస్తున్నాడు. దసరా సినిమాలో అతని ప్రతిభ చాటాడు. ది గర్ల్ ఫ్రెండ్ లో రష్మికతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఐతే వరుస సినిమాలు హిట్లు కొడుతుండటం వల్ల రష్మిక చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సూపర్ డిమాండ్ ఏర్పడింది.

ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఐతే రష్మిక ఉన్న ఫాం చూసిన హిందీ మేకర్స్ ఆమె నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను భారీ మొత్తానికి కొనేశారట. మిగతా భాషల్లో కూడా ఆ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. రష్మిక సినిమాలో ఉంది అంటే నేషనల్ వైడ్ గా డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ఇంపాక్ట్ తో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా బిజినెస్ అనుకున్న దానికన్నా బాగా జరిగిందని తెలుస్తుంది.

ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా హిట్ పడితే మాత్రం తప్పకుండా రష్మిక రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే బాలీవుడ్ టాలీవుడ్ అన్న తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది.. రష్మిక ఫిమేల్ సెంట్రిక్ మూవీగా చేస్తున్న ది గ్రల్ ఫ్రెండ్ హిట్ అయితే బాలీవుడ్ లో కూడా ఇలాంటి మరిన్ని సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాను రాహుల్ రవింద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ ఎప్పుడు సినిమా అప్డేట్స్ ఎప్పుడిస్తారంటూ నేషనల్ క్రష్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.