Begin typing your search above and press return to search.

హీరోయిన్ పాన్ ఇండియా క్రేజ్ ఆ సినిమాకు హెల్ప్ అవుతుందా..?

మరోపక్క రష్మిక చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది. ఈ సినిమాను చిలసౌ ఫేం రాహుల్ రవింద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   2 May 2025 3:00 AM IST
హీరోయిన్ పాన్ ఇండియా క్రేజ్ ఆ సినిమాకు హెల్ప్ అవుతుందా..?
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏ సినిమా చేసినా సరే ఆ ప్రాజెక్ట్ కి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో అమ్మడు చేస్తున్న సినిమాలు ఒక రేంజ్ లో సక్సెస్ కొడుతున్నాయి. మొన్నటిదాకా సౌత్ లో టాప్ లో ఉన్న రష్మిక వరుస పాన్ ఇండియా హిట్లు ఆమెను నేషనల్ వైడ్ గా టాప్ ప్లేస్ లో ఉండేలా చేశాయి. అందుకు తగినట్టుగానే రష్మిక సినిమాలు చేస్తూ తన స్థానాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుంది.

ఐతే సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్ సినిమా రష్మికకి పెద్ద ఝలక్ ఇచ్చింది. అమ్మడు ఆ సినిమా ఇలాంటి రిజల్ట్ ని అసలు ఊహించలేదు. రీసెంట్ గా ఛావా తో సూపర్ హిట్ అందుకున్న రష్మిక సికందర్ తో ఫ్లాప్ ఫేస్ చేసింది. అందుకే మళ్లీ నెక్స్ట్ వెంటనే ఒక సూపర్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ లో చేసే సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి.

ధనుష్ కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చివరి దశకు చేరుకున్నాయి. ధనుష్ బ్రాండ్ తో కుబేరకు మంచి బజ్ ఉంది. ఆ సినిమాలో రష్మిక రోల్ ఏంటి.. అది ఎలా వర్క్ అవుట్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. మరోపక్క రష్మిక చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా సంథింగ్ స్పెషల్ గా రాబోతుంది. ఈ సినిమాను చిలసౌ ఫేం రాహుల్ రవింద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు.

చిలసౌ సినిమాలో హీరోయిన్ పాత్రని అతను బాగా హ్యాండిల్ చేశాడు. నెక్స్ట్ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా రష్మికని చాలా స్ట్రాంగ్ రోల్ లో చూపించబోతున్నారని తెలుస్తుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక పాన్ ఇండియా క్రేజ్ కూడా బాగా హెల్ప్ అయ్యేలా ఉంది. ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాబట్టి సినిమాను అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేసేలా ఉన్నా రష్మిక పాపులారిటీకి ది గర్ల్ ఫ్రెండ్ కి భారీ బిజినెస్ జరుగుతుందట. సినిమా పూర్తి కాకముందే హిందీ రైట్స్, డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారని తెలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా రష్మికకు మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.