వార్ 2 తో మింగిల్ అయిన రష్మిక.. 500కోట్ల మూవీకి కలిసొస్తుందా?
వరుస పాన్ ఇండియా మూవీలతో తన జోరు కొనసాగిస్తున్న రష్మిక మందన్నా తాజాగా మరో కొత్త సినిమాతో రాబోతోంది.
By: Madhu Reddy | 12 Aug 2025 12:24 PM ISTవరుస పాన్ ఇండియా మూవీలతో తన జోరు కొనసాగిస్తున్న రష్మిక మందన్నా తాజాగా మరో కొత్త సినిమాతో రాబోతోంది. అంతేకాదు ఈ సినిమాతో హృతిక్ రోషన్ - ఎన్టీఆర్ నటిస్తున్న వార్ -2 మూవీతో కలసి సందడి చేయబోతోంది. ఇప్పటికే రెండేళ్లలో మూడు చిత్రాలతో మూడు వేల కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించిన రష్మిక.. ప్రస్తుతం చాలా బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాతో అభిమానులను పలకరించబోతోంది.మరి ఇంతకీ రష్మిక నటిస్తున్న ఆ సినిమా వివరాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మధ్యనే ఛావా, కుబేర వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న రష్మిక.. త్వరలో 'థమా' మూవీతో మన ముందుకు రాబోతోంది. హిందీ సినిమాగా వస్తున్న ఈ థమాలో ఆయుష్మాన్ ఖురేషి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా కామెడీ హార్రర్ జోనర్ లో తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఆగస్టు 14న హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ ల వార్-2 మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది. అదేరోజు పరమ సుందరి సినిమా కూడా విడుదల కాబోతోంది..అయితే ఈ సినిమాలు ప్రదర్శితమవుతున్న థియేటర్లలోనే సినిమాల మధ్యలో.. రష్మిక నటిస్తున్న థమా మూవీ నుండీ 1:50 నిమిషాల నిడివి ఉన్న టీజర్ ని కూడా విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ఎగ్జిబిటర్లతో దినేష్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అంచనాలు ఉన్న వార్ 2 తో రష్మిక రూ.500 కోట్ల మూవీ మింగిల్ కాబోతోంది. కచ్చితంగా ఆ థియేటర్లలో ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేస్తే మాత్రం కొంతమేరా వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని సమాచారం.
ఇక ఈ సినిమా దినేష్ విజన్స్ హార్రర్ కామెడీ యూనివర్స్ లో భాగం.. ఇప్పటికే విడుదలైన స్త్రీ, బేడియా వంటి సినిమాల యూనివర్స్ కి కొనసాగింపుగా ఈ థమా మూవీ వస్తోంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ఆదిత్య సర్పోత్ దార్ ఈ చిత్రాన్ని అద్భుతమైన మలుపులతో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక థమా మూవీ ఇంతకుముందు విడుదలైన ప్రధాన ఫ్రాంచైజీ చిత్రాలకు కొనసాగింపుగా రావడంతో థమా మూవీ బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రేక్షకులను ఆకర్షిస్తుందని చిత్ర నిర్మాత భావిస్తున్నారు. రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న థమా మూవీ ఆగస్టు 14న వార్-2, పరమ్ సుందరి వంటి సినిమాల విడుదల రోజే ఈ సినిమా టీజర్ ని కూడా విడుదల చేయాలని నిర్మాత దినేష్ విజన్ అనుకుంటున్నారు.
ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ లాంచ్ ఇవ్వడానికి ఎగ్జిబిటర్లతో కలిసి నిర్మాత పనిచేస్తున్నారు. అయితే స్త్రీ 2 మూవీ గత ఏడాది విడుదలై రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సంపాదించడంతో నెక్స్ట్ రాబోయే థమా మూవీపై కూడా ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. అలాగే బిజినెస్ పరంగా కూడా ఈ సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పైగా థమా మూవీ బాలీవుడ్లో అగ్రశ్రేణి ప్రతిభ కలిగిన తొలి ప్రధాన వాంపైర్ సినిమా అవుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అవేంటంటే ఇప్పటికే బాలీవుడ్ లో ఎన్నో హార్రర్, ఫాంటసీ సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలు భారీ హైప్ తో తెరకెక్కినప్పటికీ సినిమా విడుదలయ్యాక అంత ఆకట్టుకోలేకపోయాయి. మరి భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
