రష్మిక.. డిజాస్టర్ దెబ్బ పోవాలంటే ఈసారి కొట్టాల్సిందే..
ఇక దీపావళి సీజన్‌లో, అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా రష్మికకు కీలక పరీక్షగా మారనుంది.
By: Tupaki Desk | 30 April 2025 9:21 AM ISTఇటీవల బాలీవుడ్ లో అద్భుతమైన విజయాలను అందుకున్న నటి రష్మిక మందన్నా, ప్రస్తుతం కొత్త సవాలును ఎదుర్కొంటోంది. ‘పుష్ప 2’, ‘అనిమల్’, ‘ఛావా’ వంటి సినిమాలతో వరుసగా 500 కోట్ల క్లబ్‌లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక, బాలీవుడ్‌లో దీపికా పదుకొణె, ఆలియా భట్‌లను కూడా ఓడించినట్టు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. కానీ ఈ గ్లోరీస్ జర్నీకి మధ్యలో ‘సికందర్’ రూపంలో ఓ పెద్ద బ్రేక్ తగిలింది.
సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘సికందర్’ సినిమా కథాపరంగా విఫలమైంది. కంటెంట్‌లో పస లేకపోవడం, రష్మిక పాత్ర రెగ్యులర్ ట్రాక్ లో ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. ట్రోలింగ్‌ను ఎదుర్కోవడం రష్మికకు పెద్ద షాక్‌గా మారింది. ఇక ఈ కామెంట్స్ ను దాటి మళ్లీ రష్మిక సత్తా చూపించాలంటే మరో సాలీడ్ హిట్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు హోప్స్ అన్నీ ‘థామ’ మీదే ఉన్నాయి.
మాడాక్ ఫిలింస్ నిర్మిస్తున్న ఈ హారర్ కామెడీ ప్రాజెక్ట్‌లో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా జోడీగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఊటీ కొండల్లో షూటింగ్ జరుగుతోంది. హారర్ ఎలిమెంట్స్ మిక్స్ తో ఉన్న కామెడీ ట్రాక్‌తో మాడాక్ సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఈ ప్రొడక్షన్ లో వచ్చిన స్త్రీ సీరీస్, బెడియా, ముంజ్యా సినిమాలు వందల కోట్లు రాబట్టయి. ముఖ్యంగా స్త్రీ 2 800 కోట్లు రాబట్టింది.
అందుకే ‘థామ’పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇక దీపావళి సీజన్‌లో, అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా రష్మికకు కీలక పరీక్షగా మారనుంది. సికందర్ ఫెయిల్యూర్ తరువాత ఆమెను తిరిగి స్టార్ రేసులో నిలబెట్టే అవకాశం ఇది. అదే సమయంలో బాలీవుడ్ ప్రేక్షకుల్లో కొత్తగా యూత్ ఫేవరైట్‌గా నిలబడేందుకు రష్మికకి ఇది మంచి ఛాన్స్. ‘థామ’ లో ఆమె పాత్రను బలంగా రాసారని, స్క్రీన్ టైమ్ కూడా మెరుగుగా ఉంటుందని సమాచారం.
మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, ఇప్పటివరకు రష్మిక నటించిన పాన్ ఇండియా సినిమాల్లో మాస్ అవుట్‌పుట్ ఎక్కువగా కనిపించేది. కానీ ‘థామ’ వంటి హారర్ కామెడీ సినిమాతో ఆమె నటనలో న్యూ సైడ్ చూపించబోతున్నారు. ఆ పాత్రను ఆమె ఎంతవరకు విజయవంతంగా మోస్తుందన్నదే ఈ ఫెస్టివల్ బాక్సాఫీస్ వార్‌లో కీలకం కానుంది. మొత్తంగా చూస్తే, ‘థామ’ రష్మికకు మరో మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. దీపావళి బాక్సాఫీస్‌లో ఈ సినిమా సూపర్ హిట్ అయితే, ‘సికందర్’ వలయాన్ని పూర్తిగా చెరిపేసి మళ్లీ రష్మికను బాలీవుడ్ క్వీన్‌గా నిలబెట్టొచ్చు. కానీ మరోసారి ఫ్లాప్ ఎదురైతే మాత్రం, కొత్త వారితో పోటీ మరింత కఠినం కావడం ఖాయం.
