రష్మిక టాలెంట్ కి లక్కు కూడా బోనస్..!
తన కథల ఎంపిక కావొచ్చు.. ఆ సినిమాల్లో ఆమె పాత్ర కావొచ్చు.. వాటికి ఆమె చేసే అభినయం కావొచ్చు ఏదైనా సరే లక్కంటే రష్మికదే అనేలా చేస్తుంది.
By: Tupaki Desk | 24 Jun 2025 7:00 AM ISTకన్నడ భామ రష్మిక నేషనల్ వైడ్ గా కొనసాగుతున్న ఫాం చూస్తుంటే మిగతా హీరోయిన్స్ షాక్ అవ్వక తప్పదు. నేషనల్ క్రష్ అన్న పేరుని సార్థకం చేస్తూ ఆమె చేస్తున్న సినిమాలు అవి పొందుతున్న విజయాలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. రీసెంట్ గా రష్మిక కుబేర సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ధనుష్ లీడ్ రోల్ లో నటించిన కుబేర సినిమాలో నాగార్జున కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ చేశారు. శేఖర్ కమ్ముల ఈ కథ నడిపించిన తీరు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది.
రష్మిక మందన్న కూడా తన పాత్ర నిడివి తక్కువ ఉన్నా కూడా సూపర్ అనిపించుకుంది. ఒక సినిమా సక్సెస్ కు అందరు కారణమే అన్నట్టుగా అన్ని బాగా కుదిరి కుబేరని సూపర్ హిట్ చేశాయి. ఐతే కుబేర సక్సెస్ తో రష్మిక పేరు మరోసారి మారుమోగిపోతుంది. అమ్మడు ఏ సినిమా చేస్తే ఆ సినిమా నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతుంది. ఇక సౌత్ ఇండస్ట్రీ ని అయితే రష్మిక షేక్ చేస్తుందని చెప్పొచ్చు.
తన కథల ఎంపిక కావొచ్చు.. ఆ సినిమాల్లో ఆమె పాత్ర కావొచ్చు.. వాటికి ఆమె చేసే అభినయం కావొచ్చు ఏదైనా సరే లక్కంటే రష్మికదే అనేలా చేస్తుంది. ఐతే ఇదంతా కూడా లక్ తో వచ్చే సక్సెస్ అని చెప్పలేం. టాలెంట్ తో పాటు లక్ ఉంటేనే ఇలాంటి సక్సెస్ లు వస్తాయి. రష్మిక టాలెంట్ లక్ రెండు కూడా అలా సమానంగా ఉన్నాయి. అందుకే అమ్మడు ఇలా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తుంది.
రష్మిక సినిమా చేస్తే చాలు అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క అనేలా అమ్మడి ఫాం ఉంది. సౌత్ సినిమాలతో పాటు పాన్ ఇండియా సినిమాలతో సక్సెస్ కొడుతున్న రష్మిక బాలీవుడ్ సినిమాల్లో కూడా రాణిస్తుంది. కొత్త హీరోయిన్స్ ఎంతమంది వచ్చినా కూడా రష్మిక క్రేజ్ మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. తప్పకుండా రష్మిక మరికొన్నాళ్లు ఇదే సక్సెస్ మేనియా కొనసాగించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రష్మిక నెక్స్ట్ ది గర్ల్ ఫ్రెండ్ గా రాబోతుంది. ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో సినిమా ఉంటుందని తెలుస్తుంది. సో రాబోతున్న సినిమాలకు కూడా రష్మిక లక్ తోడై ఆ ప్రాజెక్ట్ లు కూడా సూపర్ హిట్ కొట్టే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
