మైసాతో రష్మిక వాటికి చెక్ పెడుతుందా?
పాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్నాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 29 Jun 2025 7:56 PM ISTపాన్ ఇండియా స్థాయిలో రష్మిక మందన్నాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకున్న రష్మిక ఇప్పుడు లీడ్ క్యారెక్టర్ లో ఓ సినిమా చేయబోతుంది. రష్మిక మందన్నా నటిస్తున్న ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ మైసా.
రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ రిలీజవగా, ఆ పోస్టర్ చూసి అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ పోస్టర్ లో రష్మిక లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోగా, ప్రీ లుక్ పోస్టర్ తోనే మైసా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటూ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. ఆ పోస్టర్ లో రష్మిక లుక్ చాలా ఇంటెన్స్ గా ఉండటంతో పాటూ చాలా హుందాగా అనిపించింది.
మైసాలో రష్మిక లుక్ ను చూసి చాలా మంది చంద్రముఖిలో జ్యోతిక, అరుంధతిలో అనుష్క లాంటి స్టార్లతో పోలుస్తున్నారు. మైసా సినిమాను రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రవీంద్ర పుల్లే, టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట. చూస్తుంటే రవీంద్ర మైసా కథను చాలా ఎమోషనల్ గా, గ్రౌండ్ వర్క్ చేసి రాసుకున్నట్టే కనిపిస్తుంది.
మైసా సినిమా రష్మికకు గతంలోని కమర్షియల్ సక్సెస్ ల మాదిరి కాకుండా నటిగా ఆమె స్కిల్స్ ను బయటపెడుతుందని అంతా భావిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు స్టార్ క్రేజ్ కంటే మంచి కథ, దాన్ని ప్రెజెంట్ చేసే విధానం ముఖం. రష్మిక మంచి నటే అయినప్పటికీ సాయి పల్లవిలా తన యాక్టింగ్ తో సినిమా మొత్తాన్ని నడిపించగలదు అనే పేరు మాత్రం లేదు. రష్మిక కేవలం పరిమిత పాత్రలు మాత్రమే చేయగలదని తరచూ ఆమెపై విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.
రష్మిక మంచి స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటున్నప్పటికీ చాలా సినిమాల్లో ఆమె యాక్టింగ్ కు అనుకున్న స్థాయి ప్రశంసలైదే దక్కలేదు. ఇప్పుడు ఆ విమర్శలన్నింటికీ మైసాతో చెక్ పెట్టాలని చూస్తోందట రష్మిక. మైసా భారాన్ని మొత్తం తన భుజాలై మోస్తూ తానెంత గొప్ప నటి అనేది అందరికీ తెలియచేయాలనుకునే క్రమంలోనే రష్మిక మైసాను ఒప్పుకుందని సమాచారం. అదే జరిగితే, మైసా సినిమా రష్మిక కెరీర్ లో గేమ్ ఛేంజర్ గా మారుతుంది.
