రష్మిక పెద్ద తప్పే చేసిందా?
అందుకు `సికిందర్` తప్పిదమే ఇప్పుడు నెట్టింట హైలైట్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయి నెలలు గుడుస్తుంది?
By: Tupaki Desk | 5 Jun 2025 8:57 PM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో అమ్మడు ఓ సంచలనం. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. నటిగానే కాక తనదైన మార్క్ చలాకీతనంతోనే తనలో ప్రత్యేకతను చాటింది. నేచురల్ పెర్పార్మర్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. టాలీవుడ్...బాలీవుడ్ లో తిరుగులేని నాయికగా దూసుకుపోతుంది. సికిందర్ రూపంలో భారీ వైఫల్యం ఎదురైనా ఆ ప్రభావం ఎక్కడా చూపించలేదు.
తాను అందుకోవాల్సిన అవకాశాలు అందుకుంటూనే ఉంది. రెండు భాషల్లోనూ ఎంతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో మరింత ఫోకస్ట్ గా పనిచేస్తుంది. ప్రచారం లో బాలీవుడ్ భామలకే ధీటుగా నిలిస్తుంది. అయితే ఎంతటి ట్యాలెంటెడ్ అయినా అప్పుడ ప్పుడు తప్పిదాలతో దొరికిపోతుంటారు. ఒక్కోసారి అవసారి అవి ప్రభావిన్ని చూపిస్తుంటాయి. కొన్నిసార్లు ఎలాంటి ప్రభావం లేకుండా కనిపిస్తుంది. కానీ దొర్లిన తప్పిదం మాత్రం నెగివిటీకి దారి తీస్తుంది అన్నది వాస్తవం.
అందుకు `సికిందర్` తప్పిదమే ఇప్పుడు నెట్టింట హైలైట్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయి నెలలు గుడుస్తుంది? కానీ అంతటి ప్రతిభావంతురాలు సికిందర్ లో పాత్రకి ఎలా కమిట్ అయిందంటూ విమర్శ నాస్త్రాలు సంధించడం మొదలైంది. ఇది ఆలస్యంగా మొదలైనే వైరల్ గామారుతోంది ఇప్పుడిప్పుడే. `సికిందర్` లో రష్మిక పాత్రను ఎంతో సిల్లీగా తీసి పారేస్తున్నారు. సినిమా మొదలైన 30 నిమిషాల్లోనే రష్మిక రోల్ చనిపోతుంది.
అటుపై ఆ పాత్ర సల్మాన్ ఖాన్ కు దెయ్యం రూపంలో కనిపిస్తుంది. సినిమాలో ఈ సన్నివేశాలు ఎంతో గందరగోళంగా ఉంటాయి. ఎలాంటి ఎమోషన్ క్యారీ అవ్వదు. పై పెచ్చి ఆశ్చర్యపోవడం అన్నది ప్రేక్షకుల వంతు అవుతుంది. రష్మిక ఈ పాత్ర ఎలా అంగీకరించింది? అన్న డౌట్ రెయిజ్ అవుతుంది. సల్మాన్ ఖాన్ -మురగదాస్ సినిమా అని ఒప్పుకుందా? ఇంకేమి ఆలోచించలేదా? అన్న సందేహం కలుగుతుంది.
