Begin typing your search above and press return to search.

క‌థల‌ ఎంపిక‌లో క‌న్న‌డ భామ‌లిద్ద‌రు ఒకేలా!

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కన్నడ భామల హవా నడుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

By:  Tupaki Desk   |   2 May 2026 3:00 PM IST
క‌థల‌ ఎంపిక‌లో క‌న్న‌డ భామ‌లిద్ద‌రు ఒకేలా!
X

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలో కన్నడ భామల హవా నడుస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, లేటెస్ట్ సెన్సేషన్ రుక్మిణి వసంత్ తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? ఇద్దరు కన్నడ అందగత్తెలు సినిమాల ఎంపిక విషయంలో దాదాపు ఒకే విధమైన సూత్రాలను పాటిస్తున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకోవడంలో ఇద్ద‌రు ఒకే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. రష్మిక మందన్నా కెరీర్ ప్రారంభం నుండి చూస్తే? స్టార్ హీరోల కే ప‌రిమితం కాకుండా పాత్రకు ప్రాముఖ్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ వచ్చింది.

`కిరాక్ పార్టీ`తో మొదలైన అమ్మ‌డి ప్రయాణం `పుష్ప`, `యానిమల్` వంటి భారీ చిత్రాల వరకు చేరింది. అయితే రష్మిక పాత్రలో వైవిధ్యం ఉంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. రెండు పాటలు, మూడు సీన్ల కోసం సినిమాలు చేయనని గతంలోనే స్పష్టం చేసింది. ఈ క్టారిటీనే ఆమెను నేడు పాన్-ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ముందుగా క‌థ‌, ఆ త‌ర్వాత పాత్ర లోతును పూర్తిగా స్ట‌డీ చేసిన త‌ర్వాతే ఏ సినిమాకైనా సైన్ చేస్తుంది. అలాగే `కాంతార2` తో సౌత్ లో ఫేమ‌స్ అయిన రుక్మిణి వసంత్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. ఆమెకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వ‌స్తున్నా? ఆచితూచి అడుగులు వేస్తోంది.

తాజాగా రవితేజ సరసన ఓ ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఆమె ప్రధానంగా కథా బలమున్న చిత్రాలకే మొగ్గు చూపుతోంది. బ‌ల‌మైన పాత్ర‌కాక‌పోతే ఎంత‌ రెమ్యునరేషన్ ఆఫ‌ర్ చేసినా? నో చెప్పడానికి రుక్మిణి వెనుకాడటం లేదని ఇండస్ట్రీ టాక్. ఎన్టీఆర్ స‌ర‌స‌న `డ్రాగ‌న్` లో న‌టిస్తున్నా? ఆ సినిమాలో అమ్మ‌డి పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంద‌ని తెలిసింది. ఇద్దరు భామల ఎంపికల్లో క‌నిపిస్తోన్న మరో పాయింట్ ఎమోషనల్ కనెక్ట్. ప్రేక్షకులు తమ పాత్రతో కనెక్ట్ అయ్యేలా ఉండే కథలనే ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. రష్మిక శ్రీవల్లిగా ఎంతగా మాస్ ఆడియన్స్‌ను మెప్పించిందో? `గీత గోవిందం`లో అంత క్లాస్ లుక్‌లో అలరించింది.

రుక్మిణి కూడా సహజసిద్ధమైన నటనతో హోమ్లీ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే? నవతరం ప్రేక్షకులకు నచ్చే పాత్రలను ఎంచుకుంటోంది. కథ వినేటప్పుడే పాత్ర గ్రాఫ్ ఎలా ఉందో క్షుణ్ణంగా పరిశీలించడం ఇద్ద‌రిలో మ‌రో కామ‌న్ పాయింట్. ప్రస్తుతం పరిశ్రమలో పోటీని తట్టుకుని నిలబడాలంటే అందం మాత్రమే సరిపోదని సరైన కథలను ఎంచుకునే విజ్ఞత ఉండాలని ఇరువురు బ‌లంగా న‌మ్ముతున్నారు. ర‌ష్మిక తెలుగు సినిమాల‌తో హిందీ చిత్రాల్లోనూ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క‌మ‌ర్శియ‌ల్ క‌థ‌ల‌తో పాటు లేడీ ఓరియేంటెడ్ క‌థ‌ల‌ను ఒకే చేస్తూ ముందుకెళ్తుంది. రుక్మిణి వసంత్ కన్నడతో పాటు తమిళ, తెలుగు చిత్రాల్లో తన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది. ఇద్ద‌రి కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే? పక్కా ప్లానింగ్‌తో లాంగ్ రన్ ఉండాలనే లక్ష్యంతో కొన్ని రూల్స్ పెట్టుకునే ముందు కెళ్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.