Begin typing your search above and press return to search.

ర‌ష్మిక దూకుడు ఒక‌టి సెట్స్‌పై..మ‌రొక‌టి..

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న స్పీడు మామూలుగా లేదు. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ చ‌క చ‌కా స్టార్ హీరోయిన్‌గా ఒక్కో మెట్టు ఎక్కేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

By:  Tupaki Desk   |   26 Jun 2025 9:00 PM IST
ర‌ష్మిక దూకుడు ఒక‌టి సెట్స్‌పై..మ‌రొక‌టి..
X

క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న స్పీడు మామూలుగా లేదు. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తూ చ‌క చ‌కా స్టార్ హీరోయిన్‌గా ఒక్కో మెట్టు ఎక్కేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఈ ఏడాది `పుష్ప‌2`తో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సంచ‌ల‌నం సృష్టించి స్టార్ హీరోయిన్‌గా రూ.1800 కోట్ల క్ల‌బ్‌లో చేరి ఘ‌న‌త సాధించిన ద‌క్షిణాది హీరోయిన్‌గా రికార్డుని సొంతం చేసుకుంది. ఇక ఇదే ఊపులో బాలీవుడ్‌లోనూ చ‌క్రం తిప్పేస్తూ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ని సొంతం చేసుకుంటూ అక్క‌డ కూడా పాగా వేసేస్తోంది.

ఈ ఏడాది ఛ‌త్రప‌తి శివాజీ మ‌హారాజ్ త‌నయుడు శంభాజీ మ‌హారాజ్ వీరోచిత జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన 'ఛావా'లో న‌టించి ఔరా అనిపించింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌లైన ఈ బాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ. 800 కోట్ల‌కు పైగా రాబ‌ట్టింది. విక్కీ కౌశ‌ల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన ఈ మూవీలో ర‌ష్మిక య‌సుబాయి భోన్స‌లేగా ప‌లికించిన హావ‌భావాలు విమ‌ర్శ‌కుల‌ని సైతం మెప్పించి ప్ర‌శంస‌లు కురిపించాయి. రీసెంట్‌గా `కుబేర‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి ఆక‌ట్టుకున్న ర‌ష్మిక ఇదే ఊపుతో బాలీవుడ్‌లో మ‌రో రెండు క్రేజీ సినిమాలు చేస్తోంది.

దినేష్ విజ‌న్ ప్రొడ‌క్ష‌న్‌లో ఆయుష్మాన్ ఖురానా హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ 'థామా'. దీన్ని స్త్రీ2 ఫేమ్ దినేష్ విజ‌న్ నిర్మిస్తున్నారు. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో రూపొందుతున్న ఈ మూవీ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని బాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీనితో పాటు కాక్‌టైల్‌2లోనూ న‌టిస్తున్న ర‌ష్మిక ఇదే స‌మ‌యంలో ఓ లేడీ ఓరియోంటెడ్ మూవీ కూడా చేస్తోంది. అదే 'గాళ్ ఫ్రెండ్‌'. షూటింగ్ పూర్త‌యినా ఇప్ప‌టికీ దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియ‌దు.

ఇది సెట్స్‌పై ఉండ‌గానే ర‌ష్మిక తాజాగా మ‌రో లేడీ మ‌హిళా ప్ర‌ధాన చిత్రాన్ని అంగీక‌రించి హీరోయిన్‌గా త‌న స‌త్తా, క్రేజ్ ఏంట‌న్న‌ది స్ప‌ష్టం చేసింది. న‌టిగా ప్ర‌స్తుతం క్రేజీ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్న ర‌ష్మిక ఈ ఏడాది మ‌రో రెండు సినిమాల‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డానికి రెడీ అవుతుండ‌టం విశేషం. అందులో ఒక‌టి బాలీవుడ్ మూవీ కాగా మ‌రొక‌టి త‌మిళ, తెలుగు భాష‌ల్లో రూపొందుతున్న గాళ్ ఫ్రెండ్‌. హీరోయిన్‌గా క్రేజీ ఫేజ్‌ని ఎంజాయ్ చేస్తున్న ర‌ష్మిక రానున్న రోజుల్లో హీరోయిన్‌గా మ‌రిన్ని సంచ‌ల‌నాల‌ని సృష్టించ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు సినీ వ‌ర్గాలు అంటున్నాయి.