తగ్గింది రెమ్యూనరేషనే.. ఛాన్సులు కాదు
ఇక తాజాగా వచ్చిన కుబేరా సినిమాకు రష్మికకు నిర్మాతలు రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించారట.
By: Tupaki Desk | 21 Jun 2025 8:00 PM ISTఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కొక్కరి టైమ్ నడుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు కొందరు లైమ్ లైట్ లో ఉంటే, ఇంకొన్ని సార్లు వేరే కొందరు లైమ్ లైట్ లో ఉంటారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక అలాంటి లైమ్ లైట్ లోనే ఉంది. భాషతో సంబంధం లేకుండా ప్రతీ ఇండస్ట్రీలోనూ సినిమాలు చేస్తూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తూ వార్తల్లో నిలుస్తూ ఉంది రష్మిక .
అయితే రష్మిక కేవలం తన సినిమాల విషయాల్లోనే కాదు, మరికొన్ని విషయాల్లో కూడా వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య రష్మిక రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప2 సినిమా కోసం రూ.10 కోట్లు ఛార్జ్ చేసిన రష్మిక రీసెంట్ గా చేస్తున్న సినిమాలకు తన పారితోషికాన్ని చాలా తక్కువ చేసింది.
ఛావా సినిమా కోసం రష్మిక రూ.4 కోట్లు తీసుకుంటే, తర్వాత సల్మాన్ ఖాన్ తో కలిసి చేసిన సికందర్ సినిమాకు రూ.5 కోట్లు ఛార్జ్ చేసింది. ఇక తాజాగా వచ్చిన కుబేరా సినిమాకు రష్మికకు నిర్మాతలు రూ. 4 కోట్లు మాత్రమే చెల్లించారట. అంటే పుష్ప2 రెమ్యూనరేషన్ తో పోలిస్తే ఇప్పుడు కుబేరాకు రష్మిక పారితోషికం సుమారు 60% తగ్గింది. ఈ వార్త ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే రెమ్యూనరేషన్ తగ్గినప్పటికీ రష్మికకు ఆఫర్లు మాత్రం ఏం తగ్గడం లేదు. రష్మిక ప్రస్తుతం థామా, ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. రెమ్యూనరేషన్ తగ్గిందని రష్మికకు కెరీర్లో బెస్ట్ రోల్స్ రావడం మాత్రం ఆగలేదు.అయితే రష్మిక విషయంలో ఈ రెమ్యూనరేషన్ అనేది పెద్ద సమస్యే కాదని అర్థమవుతుంది. రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా రష్మిక మాత్రం ప్రస్తుతం పలు పాన్ ఇండియన్ సినిమాల్లో బిజీగా ఉంది. రెమ్యూనరేషన్ అనేది సినిమా సినిమాకీ మారే అవకాశముంది. కానీ రష్మిక మాత్రం నిరంతరం ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు పెద్ద ప్రాజెక్టుల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది.
