తెర మీద అలా చేయనంటున్న రష్మిక..!
నేషనల్ క్రష్ రష్మిక ఇటీవలే కుబేర సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అదేంటో రష్మిక సినిమా తీస్తే ఫలితం ఒక్కటే అది సూపర్ హిట్టే అనే రేంజ్ లో టాక్ తెచ్చుకుంది.
By: Tupaki Desk | 1 July 2025 8:15 AM ISTనేషనల్ క్రష్ రష్మిక ఇటీవలే కుబేర సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అదేంటో రష్మిక సినిమా తీస్తే ఫలితం ఒక్కటే అది సూపర్ హిట్టే అనే రేంజ్ లో టాక్ తెచ్చుకుంది. రష్మిక చేస్తున్న సినిమాలు అన్నీ కూడా ఆమెకు మంచి క్రేజ్ తీసుకొస్తున్నాయి. సినిమా సినిమాకు ఆమె నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. మొన్నటిదాకా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది. కుబేర సినిమాతో సౌత్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా ఇంపాక్ట్ చూపించింది రష్మిక.
ఐతే తెర మీద తనకు ఎలాంటి పాత్రలు చేయాలని అనిపించదో రీసెంట్ గా ఒక కార్యక్రమంలో వెల్లడించింది రష్మిక. వి ద ఉమెన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక స్మోకింగ్ కి తాను అసలు సపోర్ట్ చేయనని చెప్పింది. ఒక సినిమా ఓకే చేసే టైం లో తాను కొన్ని రూల్స్ పెట్టుకుంటానని అందులో స్మోకింగ్ ఒకటని చెప్పారు రష్మిక. పర్సనల్ గా స్మోకింగ్ ని ఏమాత్రం పోషించని తాను.. తెర మీద కూడా అలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టపడనని చెప్పేసింది. ఒకవేళ అలాంటి సన్నివేశాల్లో నటించాలని చెబితే ఆ ప్రాజెక్ట్ వదులుకుంటా కానీ అలా చేయనని అన్నారు రష్మిక.
ఐతే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని చెప్పారు రష్మిక. ఇక ఒక సినిమా చూసి ప్రభావితం అవుతారంటే నచ్చిన సినిమాలే చూడాలని అన్నారు రష్మిక. యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ మనిషిలో ఉన్న మరో కోణాన్ని చూపించారు. ఆ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఐతే ప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదు. మీకు నచ్చిన సినిమాలు మాత్రమే చూస్తే సరిపోతుంది. రిలీజైన ప్రతి సినిమా చూడమని ఎవరు చెప్పరు కదా.. అలా చేస్తే ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతుందని అన్నారు రష్మిక.
అంతేకాదు తెర మీద నటించే పాత్రలకు పర్సనల్ లైఫ్ కి ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు రష్మిక. ఇక సినిమాల్లో సక్సెస్ అందుకోవడం ఈజీనే కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం అని అన్నారు రష్మిక. కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన రష్మిక ముందు తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుని అటుగా బాలీవుడ్ లో కూడా మంచి సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగుతుంది. సో మొత్తానికి తనకు నచ్చిన పాత్రలే చేస్తా అది కూడా తెర మీద అది తన పాత్ర వరకే కానీ పర్సనల్ లైఫ్ లో అలా ఉంటామని కాదని కథానాయికగా తన మనసులో మాటని చెప్పారు రష్మిక.
