Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో టాపే కానీ అక్కడ మాత్రం..?

నేషనల్ క్రష్ అంటూ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సైతం రష్మిక వెంట పడుతుంటే తమిళ పరిశ్రమలో ఆమెను పెద్దగా పట్టించుకోలేదు.

By:  Tupaki Desk   |   1 Jun 2025 1:00 AM IST
టాలీవుడ్ లో టాపే కానీ అక్కడ మాత్రం..?
X

కన్నడ భామ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టేస్తుంది. తెరకు పరిచమైంది కన్నడ పరిశ్రమ నుంచే అయినా రష్మికకు ఈ స్టార్ ఇమేజ్ వచ్చేలా చేసింది మాత్రం తెలుగు పరిశ్రమే అని తెలిసిందే. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ సినిమా నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ ఛాన్స్ లు అందుకుంది. తెలుగులో టాప్ రేంజ్ కి వెళ్లిన అమ్మడు అదే క్రేజ్ తో బాలీవుడ్ ఆఫర్లను అందుకుంది. రష్మిక బాలీవుడ్ ఎంట్రీ మొదటి రెండు సినిమాలు సోసోగానే ఆడిన ఆ తర్వాత మాత్రం హిట్లు సూపర్ హిట్లతో స్టార్ తిరిగింది.

బాలీవుడ్ సినిమాలు సైతం ఇప్పుడు రష్మికని హీరోయిన్ గా తీసుకోవాలని పోటీ పడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ లో రష్మిక టాప్ లీగ్ లో కొనసాగుతుంది. ఐతే తమిళంలో మాత్రం రష్మిక ఆశించిన క్రేజ్ తెచ్చుకోలేదు. అక్కడ ఆల్రెడీ స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. అయినా కూడా రష్మిక విజయ్, కార్తి లాంటి వళ్లతో నటించింది. అయినా కూడా అక్కడ రష్మికకి అంత ఫ్యాన్ బేస్ ఏర్పడలేదు.

నేషనల్ క్రష్ అంటూ ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సైతం రష్మిక వెంట పడుతుంటే తమిళ పరిశ్రమలో ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఐతే కోలీవుడ్ మీద దృష్టి పెట్టే టైం లో బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు రావడంతో తన ఫోకస్ అటు షిఫ్ట్ చేసింది రష్మిక. బీ టౌన్ ఆడియన్స్ కి రష్మిక తెగ నచ్చేసింది. నటన, గ్లామర్ ఇలా దేనికదే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తూ వస్తున్న రష్మిక టాప్ రేంజ్ కి వెళ్లడంలో తన సత్తా చాటుతుంది.

ప్రస్తుతం అమ్మడు తెలుగులో కుబేర, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలతో పాటు హిందీలో మరో రెండు సినిమాల డిస్కషన్స్ ఉన్నాయట. త్వరలో వాటి అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. రష్మిక నెక్స్ట్ విజయ్ దేవరకొండ సినిమాలో కూడా టాక్ నడుస్తుంది. ఈ ఇద్దరు జోడీ కడితే మాత్రం ఆ లెక్క వేరేలా ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఆ సినిమా విశేషాలు ఏంటన్నది త్వరలో బయటకు రానున్నాయి. రష్మిక చేస్తున్న సినిమాలు ప్లానింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు ఇవన్నీ కూడా మళ్లీ ఆమెను బాక్సాఫీస్ క్వీన్ గా మార్చే ఛాన్స్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది.