ఇండస్ట్రీలో రష్మిక కు పోటీనే లేదా?
నేషనల్ క్రష్ రష్మికకు పోటీగా మరో నాయిక లేదా? ఇండస్ట్రీలో ఆమె చెప్పిందే వేదంగా పని చేస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
By: Tupaki Desk | 20 May 2025 5:00 PM ISTనేషనల్ క్రష్ రష్మికకు పోటీగా మరో నాయిక లేదా? ఇండస్ట్రీలో ఆమె చెప్పిందే వేదంగా పని చేస్తుందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది. `యానిమల్`, `పుష్ప-2`, `ఛావా` విజయాలతో రష్మిక పాన్ ఇండియా లో తారా స్థాయికి చేరింది. అమ్మడు నటించిన 'సికిందర్' తప్ప అన్ని చిత్రాలు భారీ విజయాలు అందుకు న్నవే. సికిందర్ రూపంలో భారీ వైఫల్యం ఎదురైనా? ఆ ప్రభావం ఎక్కడా రష్మికపై కనిపించలేదు.
దీంతో అమ్మడికి ఎదురే లేకుండా సాగిపోతుంది. ప్రస్తుతం ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. అలాగని టాలీవుడ్ ఛాన్సులు మిస్ చేసుకోలేదు. మంచి అవకాశాలు వస్తే నో చెప్పకుండా కమిట్ అవుతుంది. వచ్చే అవకాశాలు కూడా అలాంటివే. పారితోషికం కూడా భారీగా పెంచేసింది. ఒక్కో సినిమాకు భారీగా డిమాండ్ చేస్తుంది. రూపాయి తగ్గడానికి వీల్లేదంటూ కండీషన్లు పెడుతుందట. టెర్మ్స్ అండ్ కండీషన్స్ తూచ తప్ప కుండా పాటిస్తుందిట.
ఒకప్పుడులా ఇప్పుడు సెట్స్లో అదనంగా సమయం కేటాయించలేదట. టైమ్ కి రావడం వెళ్లిపోవడం అన్నట్లే ఉంటుందిట. అలాగని దర్శక, నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదుట. వాళ్ల మాటలకు విలువ నిస్తూనే పని చేస్తుందట. టైమ్ రష్మికది కాబట్టి ఇప్పుడేం చేసినా చెల్లుతుంది. ఇక ఇండస్ట్రీలో రష్మికకు రీప్లేస్ మెంట్ నాయిక లేదని కూడా గట్టిగా వినిపిస్తుంది. రష్మిక నటించాల్సి వస్తే తాను చేయాల్సిందే తప్ప మరో నటితో రీప్లేస్ మెంట్ చేద్దామంటే డైరెక్టర్లు కూడా రాజీకి రావడం లేదుట.
రష్మిక ఎనర్జీని మరే నటి మ్యాచ్ చేయలేకపోవడంతోనే ఈ రకమైన ఇబ్బంది ఎదుర వుతుందని కొంత మంది దర్శక, రచయితలు అభిప్రాయపడుతున్నారు. రష్మికని పక్కనబెట్టి కొత్త భామలతో రిస్క్ తీసుకుందామంటే? అందుకు నిర్మాతలు తొందరగా ఒప్పుకోవడం లేదుట. ఆమె బ్రాండ్ తో బిజినెస్ ముడిపడి ఉండటంతో? రూపాయి ఎక్కువైనా రష్మికనే ఒప్పి దామంటున్నారట.
