ఎర్రబడిన రష్మిక కళ్లు.. ఎందుకంటే
నైట్ షూటింగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రష్మిక తన నైట్ షూట్స్ గురించి మాట్లాడింది.
By: Tupaki Desk | 15 April 2025 4:19 PM ISTకిర్రిక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన రష్మిక తక్కువ టైమ్ లోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆల్మోస్ట్ సౌత్ లోని అగ్ర హీరోలందరితో సినిమాలు చేసిన రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటాలని చూస్తోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న రష్మిక రీసెంట్ గా ఛావా సినిమాతో మరో సెన్సేషనల్ సక్సెస్ ను అందుకుంది.
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ చేసిన రష్మిక ఆ సినిమాతో డిజాస్టర్ ను అందుకుంది. సినీ ఇండస్ట్రీలో హిట్టూ ఫ్లాపులు కామన్ అనుకుని సికందర్ డిజాస్టర్ ను లైట్ తీసుకున్న రష్మిక ప్రస్తుతం థామా అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కోసం రష్మిక నైట్ షూట్ చేసి బాగా అలసిపోతుంది. ఈ విషయాన్ని స్వయంగా రష్మికనే వెల్లడించింది.
ఆయుష్మాన్ ఖురానాతో రష్మిక మందన్నా చేస్తున్న థామా సినిమా గత కొన్ని రోజులుగా నైట్ షూట్స్ జరుపుకుంటుంది. ఈ నైట్ షూట్స్ లో హీరోహీరోయిన్లపై సీన్స్ ను షూట్ చేస్తున్నట్టు సమాచారం. నైట్ షూటింగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రష్మిక తన నైట్ షూట్స్ గురించి మాట్లాడింది.
రాత్రంతా నిద్ర లేక కళ్లు బాగా ఎర్రగా అయిపోయాయి. షూటింగ్ వల్ల బాగా అలసిపోయా. ఉదయాన్నే అందరికీ పాజిటివ్ వైబ్ ను క్రియేట్ చేయడం కోసం ఈ వీడియోని ఊరికే చేశానని అందరికీ గుడ్ మార్నింగ్. మీరు కూడా నాలానే హ్యాపీగా డేను మొదలుపెట్టాలని కోరుకుంటున్నా, లవ్ యూ ఆల్, ఏం జరిగినా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయమని చెప్పింది రష్మిక.
ఇక సినిమాల విషయానికొస్తే రష్మిక పలు భాషల్లో నటిస్తూ హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉంది. బాలీవుడ్ లో థామా సినిమా చేస్తున్న రష్మిక ఆ సినిమాను సమ్మర్ కు పూర్తి చేయనుంది. దీపావళికి థామా రిలీజయ్యే ఛాన్సుంది. ఈ మూవీలో రష్మిక ఓ డిఫరెంట్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఇక తెలుగులో రష్మిక కుబేర సినిమాతో పాటూ గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో సినిమాల్లో కూడా నటిస్తోంది.