రష్మిక తో హను శిష్యుడు పెద్ద సాహసమే!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నేడు పాన్ ఇండియానే షేక్ చేస్తోన్న నటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అమ్మడి క్రేజ్ ఆకాశాన్నంటుతుంది.
By: Tupaki Desk | 28 Jun 2025 4:00 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్నా నేడు పాన్ ఇండియానే షేక్ చేస్తోన్న నటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అమ్మడి క్రేజ్ ఆకాశాన్నంటుతుంది. ఇప్పుడిప్పుడే ఆ క్రేజ్ ను సోలోగా ఎన్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో సోలోగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే 'మైసా' అనే చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
పోస్టర్ లో రష్మిక ఆహార్యం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా రష్మిక కళ్లలో హావభాలు కనికట్టు చేస్తున్నాయి. రష్మిక కళ్లతో నటించగల రేర్ నటి. ఈ రకమైన పెర్పార్మెన్స్ గతంలో జ్యోతిక ఇచ్చేది. మేల్ నటుల్లో సూర్య కు మళ్లీ ఆ ఇమేజ్ ఉంది. ఆ తర్వాత మళ్లీ రష్మికకే ఆఛాన్స్ దక్కింది. మైసా చిత్రాన్ని తెరకెక్కి స్తోంది దర్శకుడు హను రాఘవపూడి శిష్యుడు అని తెలిసింది. పలు సినిమాలకు హను వద్ద పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
రష్మిక ట్యాలెంట్ ని...పాన్ ఇండియా క్రేజ్ ని తెలివిగా ఆరంభంలోనే వినియోగించుకుంటున్నాడు. ఇప్పటి వరకూ 'మైసా'పై పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది. సినిమాకు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. అయితే రష్మికకు ఇదే తొలి లేడీ ఓరియేంటెడ్ చిత్రం. దీంతో తెరపై ఆమెని ఎలా ఆవిష్కరించబోతున్నాడు? అన్న టెన్షన్ రష్మిక అభిమానుల్లో ఉంది. రష్మికకు మేల్ అండ్ పీమేల్స్ లో భారీ ఫాలోయింగ్ ఉంది.
తనకంటూ ప్రత్యేక మైన ప్యాన్ బేస్ ఉంది. రష్మిక కోసమే థియేటర్ కు వచ్చే ఆడియన్స్ ఉన్నారు. అంతటి క్రేజీ బ్యూటీతో లేడీ ఓరియేంటెడ్ అంటే? ప్రేక్షకుల్ని అంతే ఎంగేజ్ చేయాలి. ఇందులో ఎక్కడ తేడా జరిగినా విమర్శలు తప్పవు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కొత్త దర్శకుడు పని చేయాల్సి ఉంటుంది.
