బేడీల చేతితో తుపాకి పడితే.. రష్మిక 'మైసా' టీజర్ మాటల్లేవ్ అంతే..!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న నుంచి నెక్స్ట్ రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీ మైసా.
By: Tupaki Desk | 24 Dec 2025 1:11 PM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న నుంచి నెక్స్ట్ రాబోతున్న ఇంట్రెస్టింగ్ మూవీ మైసా. రవీంద్ర పుల్లే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అన్ ఫార్ములా ఫిలింస్ బ్యానర్ లో అజయ్, అనీల్ సత్యపురెడ్డి, సాయి గోపా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ఫస్ట్ గ్లింప్స్ రిలీజైంది. రష్మిక మరో ఇంట్రెస్టింగ్ రోల్ తో సర్ ప్రైజ్ చేయబోతుందని అనిపిస్తుంది. జస్ట్ టీజర్ గ్లింప్స్ తోనే మైసా రేంజ్ ఏంటన్నది శాంపిల్ చూపించారు. రవీంద్ర పుల్లే ఎంతో ఇంటెన్స్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
కూతురు గురించి ఒక తల్లి ఎలివేషన్..
గ్లింప్స్ లో రష్మిక ఇంటెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నిటికీ మించి ఆ డైలాగ్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయి. రష్మిక స్టోరీ సెలక్షన్ ని మరోసారి సూపర్ అనేలా మైసా గ్లింప్స్ ఉంది. తన కూతురు గురించి ఒక తల్లి ఎలివేషన్ ఇస్తూ చెప్పిన డైలాగ్స్ అదరగొట్టాయి. ముఖ్యంగా రష్మికని అలా బ్లడ్ బాత్ లుక్ లో చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
తను ఎంచుకునే ప్రతి రోల్ కి ప్రాణం పెట్టేస్తుంది రష్మిక. ఆమె కెరీర్ లో మైసా మరో అద్భుతమైన సినిమాగా మిగిలేలా ఉంది. ముఖ్యనంగా ఆమె లుక్, ఇంటెన్స్ అంతా కూడా కథకు చాలా బలంగా సపోర్ట్ చేసేలా ఉన్నాయి. రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మైసా సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
నేషనల్ క్రష్ రష్మిక ది గర్ల్ ఫ్రెండ్..
రష్మిక మందన్న మరోసారి తన సత్తా చాటేలా మైసా సినిమాతో రాబోతుంది. టీజర్ తోనే అదుర్స్ అనిపించిన ఈ చిత్రయూనిట్ సినిమాతో ఇంకా ఎంత సర్ ప్రైజ్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. నేషనల్ క్రష్ రష్మిక రీసెంట్ గా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఒక అదిరిపోయే రోల్ తో సర్ ప్రైజ్ చేసింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతోనే సూపర్ అనిపించుకున్న రష్మిక ఇప్పుడు మైసాతో మరోసారి సూపర్ అనిపించేలా చేయబోతుంది. నేషనల్ క్రష్ రష్మిక ఫ్యాన్స్ అంతా మైసా లో రష్మిక యాక్షన్ అడ్వెంచర్ తో ఫుల్ ఫీస్ట్ పొందే ఛాన్స్ ఉందనిపిస్తుంది.
రష్మిక మందన్న ప్రతి సినిమాకు ఫుల్ ఎఫర్ట్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. ఇక మైసా లాంటి ఛాలెంజింగ్ రోల్స్ ఆమెలో ఉన్న ప్రతిభని మరింత బయట పెట్టేలా చేస్తాయి. స్టార్ హీరోయిన్ గా ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మైసా లాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం ఈతరంలో రష్మిక వల్లే అవుతుంది అనిపించేలా తనని తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తుంది రష్మిక. మైసా గ్లింప్స్ ఇన్ స్టంట్ గూస్ బంప్స్ ఇవ్వగా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే మాత్రం నేషనల్ క్రష్ కాదు మరోసారి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రష్మిక పేరు మారుమోగుతుందని చెప్పొచ్చు.
