Begin typing your search above and press return to search.

ఏడుస్తూ ఎదురు చూస్తున్నా : రష్మిక మందన్న

చెల్లిని ఎప్పుడూ చూడాలని ఉంటుంది, కానీ వరుస షూటింగ్ కారణంగా నెలలో కనీసం ఒక్కసారి కూడా చూడని సందర్భాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   17 July 2025 2:00 PM IST
ఏడుస్తూ ఎదురు చూస్తున్నా : రష్మిక మందన్న
X

టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న. సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్స్‌ జాబితాలో ముందు వరుసలో ఈ అమ్మడు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలకు తగ్గకుండా రిలీజ్‌లు ప్లాన్‌ చేస్తున్న రష్మిక మందన్న క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఈ రోజు హైదరాబాద్‌లో షూటింగ్‌లో ఉంటే, రేపు ముంబై, ఆ వెంటనే చెన్నై, బెంగళూరు ఇలా తిరుగుతూనే ఉంది. విదేశీ షెడ్యూల్ కూడా ఎక్కువగా ఉంటాయి. దాంతో రష్మిక మందన్న ఫ్యామిలీకి సమయం కేటాయించలేక పోతుందట. ఈ విషయాన్ని ఎప్పుడూ రష్మిక చెబుతూనే ఉంటుంది.

గతంలో ఒక ఇంటర్వ్యూలో వరుస సినిమాల షూటింగ్స్ కారణంగా ఫ్యామిలీ మెంబర్స్‌కు టైం ఇవ్వలేక పోతున్నాను అంటూ బాధ పడ్డ రష్మిక మందన్న తాజా ఇంటర్వ్యూలో మరింత ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ... షూటింగ్స్ నుంచి సెలవు కోసం నేను ఎంతో ఎదురు చూస్తూ ఉంటాను. వరుస షూటింగ్స్‌తో విసిగి పోయి, సెలవు కోసం ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా ఇంట్లో నా కంటే 16 ఏళ్లు చిన్నదైన చెల్లి ఉంటుంది. తను ఇప్పుడు 13 ఏళ్ల వయసు. నేను గత 8 ఏళ్ల నుంచి తన ఎదుగుదలను చూడలేక పోయాను. ఎక్కువగా వీడియో కాల్‌లో మాత్రమే తనను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

చెల్లిని ఎప్పుడూ చూడాలని ఉంటుంది, కానీ వరుస షూటింగ్ కారణంగా నెలలో కనీసం ఒక్కసారి కూడా చూడని సందర్భాలు ఉన్నాయి. రెగ్యులర్‌గా ఫోన్‌ ద్వారా మాట్లాడుతూనే ఉన్నా తను ఎదుగుదలను కళ్లతో చూడలేక పోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని రష్మిక మందన్న ఆవేదన వ్యక్తం చేసింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా రష్మిక మందన్న క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు సినిమాలు చేయాలని భావిస్తోంది. అందుకే ఈ పీక్‌ సమయంలోనే ఎక్కువ సినిమాలను రష్మిక చేయాల్సి ఉంటుంది. నెలల తరబడి ఇంటికి కూడా వెళ్లకుండా రష్మిక షూటింగ్స్‌లో పాల్గొంటూనే ఉంటుందట. అందుకే చెల్లిని చాలా మిస్‌ అవుతున్నట్లు రష్మిక పేర్కొంది.

యానిమల్‌, పుష్ప 2, ఛావా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన రష్మిక మందన్న ఆ మధ్య సల్మాన్‌ ఖాన్‌తో చేసిన సికిందర్‌ సినిమాతో ఫ్లాప్‌ను చవి చూసింది. ఆ వెంటనే ధనుష్‌ తో చేసిన కుబేర సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం రష్మిక నటించిన లేడీ ఓరియంటెడ్‌ మూవీ గర్ల్‌ ఫ్రెండ్‌ విడుదలకు ముస్తాభవుతోంది. సెప్టెంబర్‌లో ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అది మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు సైతం రష్మిక మందన్న చేస్తుంది. వచ్చే ఏడాదిలో రష్మిక నటిస్తున్న, నటించబోతున్న సినిమాల్లో కనీసం మూడు నాలుగు అయినా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీ ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో రష్మిక ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. కనుక పెళ్లి గురించి కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది ఎప్పుడు అనేది అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.