బెంగుళూరులో రష్మిక రౌండ్లు వేస్తోందిలా!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మూడు పువ్వులు ఆరు కాయలుగా కెరీర్ సాగిపోతుంది.
By: Tupaki Desk | 8 Jun 2025 11:48 PM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మూడు పువ్వులు ఆరు కాయలుగా కెరీర్ సాగిపోతుంది. పాన్ ఇండియాలో ఫేమస్ అవ్వడంతో ఆదాయం పెరిగింది. కోట్లాది రూపాయలు పారితోషికంగా అందుకుంటుంది. కెరీర్ లో ఇంత గొప్ప జీవితాన్ని తాను ఏమాత్రం ఊహించలేదు. నలుగురితో కలిసి వచ్చినా? ఇప్పుడా నలుగురిలా ఒక్కరు కాదు ఆమె. అభిమానులకు రష్మిక ఇప్పుడో స్పెషల్.
ఇక రష్మిక లైఫ్ ని ఎలా ఆస్వాదిస్తుందంటే? తనకు నచ్చినట్లు ఎంతో విలాసవంతమైన జీవితాన్ని చూస్తుంది. తాజాగా అమ్మడు బెంగుళూరు రోడ్లపై తిరగాలంటే కేవలం ఆడీ క్యూ 3 కారు మాత్రమే వినియోగిస్తుందిట. ఇంట్లో ఇంకా చాలా రకాల కార్లు ఉన్నా? వాటిని మాత్రం వాడదుట. బెంగుళూరు వెళ్లిదంటే క్యూ 3లో రౌండ్లు వేయాల్సిందేట. రష్మిక గ్యారేజ్ లో రేంజ్ రోవర్, బెంజ్ లాంటి విలాస వంతమైన కార్లు ఉన్నా వాటిని పెద్దగా వాడదట.
ఇంట్లో వాళ్లు వాడుకుంటారుట. తాను మాత్రం బెంగుళూరు వెళ్తే క్యూ 3 తొక్కుతానంది. అలాగే మార్కెట్ లో కి వచ్చిన కొత్త కార్లు కొనడం కూడా చేస్తుందిట. కార్ల కలెక్షన్ అంటే ఇష్టమంది. ప్రస్తుతం రష్మిక పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది. ప్రత్యేకించి బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టింది. యానిమల్, ఛావాలాంటి విజయాలు రష్మిక రేంజ్ ని అక్కడ అమాంతం పెంచేసాయి.
పాన్ ఇండియాలో పుష్ప విజయంతో తిరుగు లేకుండా అన్ని భాషల్లో ఫేమస్ అయింది. ప్రస్తుతం ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నా? బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టి పని చేస్తోంది. త్వరలో `కుబేర` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పాన్ ఇండియా రిలీజ్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది.
