ఆ వాసన ఎంత బావుంటుందో..!
అయితే రష్మిక ఓ వైపు సినిమాల్లో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఏదొక అప్డేట్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది.
By: Tupaki Desk | 24 May 2025 2:41 PM ISTసౌత్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆఖరిగా మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ సరసన సికందర్ లో నటించిన రష్మిక దాని కంటే ముందు ఛావా సినిమాలో నటించి అందరినీ మెప్పించింది. ఛావా సినిమాలో విక్కీ కౌశల్ సరసన నటించి ఆ సినిమాలో తన నటనతో ఎంతో మంచి ప్రశంసలు అందుకుంది రష్మిక.
ప్రస్తుతం రష్మిక పలు భాషల్లో సినిమాలు చేస్తూ తన డైరీని మరో రెండేళ్ల పాటూ చాలా బిజీగా ఉంచుకుంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో థామా సినిమా చేస్తున్న రష్మిక ఆ సినిమాలో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకోనుంది. దాంతో పాటూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కుబేరలో కూడా రష్మిక నటిస్తుంది. ఇవి కాకుండా ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్ బో సినిమాల్లో కూడా రష్మిక నటిస్తోంది.
అయితే రష్మిక ఓ వైపు సినిమాల్లో నటిస్తూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఏదొక అప్డేట్‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటుంది. తాజాగా అమ్ముడు తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ స్టోరీ ఇప్పుడు అందరినీ ఆకర్షించడంతో పాటూ ఎంత సెలబ్రిటీ అయినా రష్మిక ఆలోచనలు, అభిరుచులు మామూలు సాధారణ మనుషుల్లానే ఉన్నాయని తెలియచేసింది.
తనకు వర్షం పడినప్పుడు ముందుగా వచ్చే వాసన అంటే చాలా ఇష్టమని రష్మిక ఈ సందర్భంగా తెలిపింది. రష్మిక తానున్న చోట వర్షం పడుతున్న వీడియోను రికార్డు చేసి దాన్నిషేర్ చేస్తూ వర్షాలు తిరిగొచ్చాయి. వర్షాల వల్ల ప్రతీ పనీ నెమ్మదిస్తుందని, అందుకే తనకు వర్షమంటే పెద్దగా ఇష్టముండదని, కానీ వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన ఎంత బావుంటుందో అని, ఆ వాసనను ఫీలవడం ఎంతో గొప్ప అనుభూతి అని రష్మిక తన స్టోరీలో రాసుకొచ్చింది.
