రష్మిక తొలి ప్రేమికుడు...లవ్ లెటర్ ఇదే !
అయితే తాజాగా ఓ సమావేశంలో రష్మిక తొలి లవ్ ఎక్కడ ప్రారం భమైంది? అంటే స్కూల్లో అని తెలిపింది.
By: Tupaki Desk | 21 Jun 2025 12:00 AM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆకాశమే హద్దుగా అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో దూసుకుపోతుంది. అత్యధిక పారితో షికం అందుకుంటున్న భామగాను చరిత్రకు ఎక్కింది. బాలీవుడ్ లో స్థిరపడాలనే ఆశయంతో పని చేస్తోంది. ఇప్పుడిప్పుడే అక్కడ స్ట్రాంగ్ కెరీర్ ను బిల్డ్ చేసు కుంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోలతో ఛాన్సులందుకుంటుంది. ఇటు తెలుగు నుంచి ఏకంగా పాన్ ఇండి యా చిత్రాలే ఒడిసి పట్టుకుంటుంది.
కెరీర్ పరంగా ఇలా సంతోషంగానే సాగిపోతుంది. మరి వ్యక్తిగత జీవి తంలో లవ్ గివ్ ఏదైనా ఉందా? అంటే అది తనకే తెలియాలి. కెరీర్ ఆరంభంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రేమలో పడింది. అతడితో ఎంగేజ్ మెంట్ చేసుకోవడంతో పీఠలెక్కే సమయంలో రద్దు చేసుకోవడం తెలి సిందే. ఆ తర్వాత మళ్లీ రక్షిత్ శెట్టి విషయమే ఎక్కడా చర్చకు రాలేదు. అయితే తాజాగా ఓ సమావేశంలో రష్మిక తొలి లవ్ ఎక్కడ ప్రారం భమైంది? అంటే స్కూల్లో అని తెలిపింది.
అలాగే మొదటి ప్రేమ లేఖ ఎక్కడ? అని అడిగినా అదీ స్కూల్లోనే అని సమాధానం ఇచ్చింది. మధ్య లో ఎక్కడైనా రక్షిత్ శెట్టి గురించి మాట్లాడుదునుకున్నారంతా కానీ ఆ టాపిక్ రాకుండా తాను కూడా జాగ్రత్త పడ్డట్లు కనిపించింది. వేసిన ప్రశ్నలంన్నింటికీ చిన్నప్పటి స్కూల్ అనేసరికి అసలు విషయంలో బయ టకు రాలేదు. రక్షిత్ శెట్టి గురించి ఎక్కడైనా అడుగుతారేమోనాని రష్మిక కూడా ఊహించింది.
కానీ అంత ఛాన్స్ ఎవరూ తీసుకోలేదు. ప్రస్తుతం మాత్రం టాలీవుడ్ లో ఓ యువ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారం చాలా కాలంగా ఉంది. కానీ అది స్నేహంగానే భావిస్తున్నాం తప్ప ప్రేమగా కాదంటూ పలుమార్లు వివరణ వచ్చింది. అయినా ఇద్దరు కలిసిన ఫోటోలు బయటకు రావడం మాత్రం ఆగలేదు.
