అందుకే ఎవరూ ఊహించనిదే జీవితం
జీవితం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరూ ఊహించనిదే జీవితం అంటుంటారు పెద్దలు.
By: Tupaki Desk | 31 May 2025 10:00 PM ISTజీవితం ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో, ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ఎవరూ ఊహించనిదే జీవితం అంటుంటారు పెద్దలు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదంటుంది నేషనల్ క్రష్ రష్మిక. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే జీవితంలో ఒత్తిడి ఉండదని కూడా రష్మిక చెప్తోంది. రష్మిక నటించిన ఛావా బ్లాక్ బస్టర్ అవగా, ఆ తర్వాత కొన్నాళ్లకు వచ్చిన సికందర్ సినిమా డిజాస్టర్ అయింది. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో రష్మిక స్పందించింది.
లైఫ్ లో ఏదీ పర్మినెంట్ కాదనే విషయం తనకు తెలుసుని, గతంలో కూడా ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పానని రష్మిక చెప్పింది. ఒక రోజు సిట్యుయేషన్స్ మనకు అనుకూలంగా ఉంటే, తర్వాతి రోజు అవన్నీ మారిపోతాయని అంటోంది. తానెలాంటి పరిస్థితిలో ఉన్నా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి మద్దతు ఉండటం తన అదృష్టమని రష్మిక చెప్పుకొచ్చింది.
జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని ఎదుర్కొనే సమయంలో తన కుటుంబం, స్నేహితులు ఎప్పుడూ తనతోనే ఉన్నారని, ప్రతీ విషయంలో వారే తనకు సపోర్ట్ గా నిలుస్తారని తెలిపారు. తాను నటిని అవాలనుకుని ప్లాన్ చేసుకోలేదని, ఇండస్ట్రీలోకి రావడానికి స్పెషల్ గా ఏమీ చేయలేదని, ఇప్పుడు కెరీర్లో వెనక్కి తిరిగి చూసుకుంటే నేనెంత అదృష్టవంతురాలినో అనిపిస్తుందని రష్మిక పేర్కొంది.
మన కెరీర్ విషయంలో మనం స్థిరంగా ఉంటూ మనసుకు నచ్చిన పని చేయాలని, తాను అందరికీ ఇచ్చే సలహా కూడా అదేనని రష్మిక చెప్పింది. కూర్గ్ లాంటి చిన్న టౌన్ లో పుట్టి, ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం ఇదేనని, వచ్చిన ప్రతీ ఛాన్స్‌నీ వాడుకుంటూ ముందుకు సాగాలని, ఈ జర్నీలో కష్టమైనవేమీ ఉండవని, అన్నీ విలువైన ఎక్స్‌పీరియెన్స్‌లే ఉంటాయని తెలిపింది. జీవితంలో ఎప్పుడూ బెస్ట్ గా ఉండటానికి ట్రై చేయమని చెప్తున్న రష్మిక ఇతరులను సంతోషపెట్టాలని, వారి మెప్పు పొందాలనే మెప్పు మాత్రం మోయొద్దని రష్మిక సూచిస్తోంది.
