ప్రతీ ఒక్కరితో దయగా ఉండండి.. రష్మిక పోస్ట్ వైరల్
వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రష్మిక తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది.
By: Tupaki Desk | 19 Jun 2025 11:11 AM ISTఈ సంవత్సరం అనుకోకుండా పలు ప్రమాదాలు జరిగాయి. మొన్నా మధ్య ప్రయాగరాజ్ తొక్కిసలాట, పహల్గామ్ దాడి, బెంగుళూరులో తొక్కిసలాట, రీసెంట్ గా ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం వల్ల జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో అనేది తెలియకుండా పోతుంది. ఈ పరిస్థితులు జీవితంలోని అనిశ్చితి గురించి ఆలోచించేలా చేస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ రష్మిక తన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా రష్మిక తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేయగా, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందరితో కలిసి ఉండటం తనకెంతో సంతోషాన్నిస్తుందని చెప్పిన రష్మిక, మనకింకా ఎంత టైముందో మనకు తెలియదంటోంది.
టైమ్ చాలా డెలికేట్ గా ఉందని, టైమ్ తో పాటూ మనం కూడా డెలికేట్ గా ఉన్నామని, ఫ్యూచర్ ను ఎవరూ ఊహించలేమని, కాబట్టి దయచేసి ఒకరిపై ఒకరు దయగా ఉంటూ, మీ పట్ల మీరు కూడా దయగా ఉండమని కోరింది. జీవితంలో మీకు అత్యంత ముఖ్యం అనుకున్న పనులను వెంటనే చేయమని రష్మిక తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
అయితే రష్మిక ఇలా దయగా ఉండండి అని చెప్పడం ఇదేమీ మొదటిసారి కాదు, ఫిబ్రవరిలో కూడా రష్మిక తన ఇన్‌స్టాలో ఈ విషయంపై పోస్ట్ చేసింది. "ఈ రోజుల్లో అందరిలోనూ దయ తగ్గిపోతుంది. నేను అందరినీ ఒకేలా చూస్తాను. మీరు కూడా అలానే ఉండండి. ఒకరిపై ఒకరు దయతో ఉండండ"ని పోస్ట్ చేయగా, ఇప్పుడు మరోసారి అదే టాపిక్ పై మాట్లాడటం గమనార్హం.
ఇక కెరీర్ విషయానికొస్తే రష్మిక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ తో చేసిన కుబేర సినిమా జూన్ 20న రిలీజ్ కానుంది. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని, నటిగా తానెప్పుడూ భిన్నంగా ఉండే పాత్రలు చేయడానికి ట్రై చేస్తుంటానని, కుబేర అలాంటి సినిమానే అని, ఇంతకు ముందెప్పుడూ తాను ఇలాంటి పాత్ర చేయలేదని, కుబేర సినిమా అందరికీ నచ్చుతుందని రష్మిక తెలిపింది.
