Begin typing your search above and press return to search.

స‌మంత అన్నారు, కానీ ర‌ష్మిక మొద‌లెట్టేసిందిగా!

కెరీర్ లో స‌క్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తున్న ర‌ష్మిక వెనుక ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. సినిమాల నుంచి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల వ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ తెలివిగా వాడుకుంటూ క్రేజ్ తో పాటూ క్యాష్ కూడా చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2025 12:00 AM IST
స‌మంత అన్నారు, కానీ ర‌ష్మిక మొద‌లెట్టేసిందిగా!
X

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్తున్నారు ర‌ష్మిక మంద‌న్నా. ఎక్క‌డో క‌ర్ణాట‌క‌లోని మారు మూల ప్రాంతం నుంచి వ‌చ్చిన ర‌ష్మిక ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. పుష్ప‌, యానిమ‌ల్, పుష్ప‌2, ఛావా, కుబేర లాంటి వ‌రుస హిట్లతో ర‌ష్మిక క్రేజ్, ఇమేజ్, మార్కెట్ సినిమా సినిమాకీ పెరుగుతూ వ‌స్తున్నాయి.

కెరీర్ లో స‌క్సెస్‌ఫుల్ గా దూసుకెళ్తున్న ర‌ష్మిక వెనుక ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. సినిమాల నుంచి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల వ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్నీ తెలివిగా వాడుకుంటూ క్రేజ్ తో పాటూ క్యాష్ కూడా చేసుకుంటున్నారు. దీపం ఉన్న‌ప్పుడే చ‌క్క‌బెట్టుకోవాల‌న్న‌ట్టు క్రేజ్ ఉన్న‌ప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాల‌నే ఫార్ములాని ర‌ష్మిక ఫాలో అవుతున్నారు.

అందులో భాగంగానే ర‌ష్మిక ఇప్పుడో డెసిష‌న్ తీసుకున్నారు. సినిమాల‌తో, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల‌తో రెండు చేతులా సంపాదిస్తున్న ర‌ష్మిక ఇప్పుడు త‌న సంపాద‌న‌ను తెలివిగా పెట్టుబ‌డి పెడుతున్నారు. రీసెంట్ గా ఓ గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నాన‌ని ఊరించిన ర‌ష్మిక ఇప్పుడా విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. డియ‌ర్ డైరీ పేరుతో ర‌ష్మిక ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ను లాంచ్ చేశారు.

ఈ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ను లాంచ్ చేస్తూ ర‌ష్మిక ఓ యాడ్ ను త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఇది కేవ‌లం బ్రాండో లేదా పెర్ఫ్యూమో మాత్రమే కాద‌ని, డియ‌ర్ డైరీ త‌న‌లో భాగ‌మ‌ని చెప్పుకొచ్చారు. పెర్ఫ్యూమ్ కు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. అందులో ఓ సెల‌బ్రిటీ నుంచి వ‌స్తున్న బ్రాండ్ కావ‌డంతో దానికి ఇంకాస్త ఎక్కువ క్రేజే ఉంటుంది. చాలా మంది చేతిలో డ‌బ్బులున్నాయి క‌దా అని ఏదిప‌డితే అది, ఎలా పడితే అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ర‌ష్మిక మాత్రం చాలా తెలివిగా పెర్ఫ్యూమ్ బ్రాండ్ ను క్రియేట్ చేసి దాన్ని మార్కెట్ చేస్తున్నారు. ఈ బిజినెస్ విష‌యంలో త‌న‌కు అంద‌రి స‌పోర్ట్ కావాల‌ని చెప్తోన్న ర‌ష్మిక మొత్తానికి సైలైంట్ గా బిజినెస్ లోకి ఎంట‌ర‌య్యారు. అయితే రీసెంట్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత కూడా పెర్ఫ్యూమ్ బిజినెస్ లోకి ఎంట‌ర‌వుతున్నార‌ని వార్త‌లొచ్చాయి కానీ ర‌ష్మిక మాత్రం చాలా సడెన్ గా ఈ బిజినెస్ లోకి ఎంట‌రై అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.