అక్కడకి మాకాం మార్చిన రష్మిక..!
ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. ఐతే రష్మిక తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ తో అలరిస్తుంది.
By: Tupaki Desk | 29 April 2025 1:00 AM ISTనేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫాం గురించి అందరికీ తెలిసిందే. మొన్నటిదాకా సౌత్ లో స్టార్ సినిమాలతో అదరగొట్టిన అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా క్రేజీ హిట్లతో దూసుకెళ్తుంది. హిందీలో అడుగు పెట్టిన మొదటి రెండు సినిమాలు కాస్త డౌట్ అనిపించేలా రిజల్ట్ ఇచ్చినా యానిమల్ తో అమ్మడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతకుముందే పుష్ప 1 తో సూపర్ హిట్ అందుకున్న రష్మిక యానిమల్ తో డబుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఆ నెక్స్ట్ పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ కొట్టేసింది.
ఆ సినిమాల సక్సెస్ తో రష్మిక రేంజ్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది. ఇక రీసెంట్ గా వచ్చిన ఛావా సినిమాతో అమ్మడు మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ లో రష్మిక సినిమాలో ఉంది అంటే సూపర్ హిట్ అన్నట్టే అనే లెక్క కనిపిస్తుంది. ఐతే రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తో చేసిన సికందర్ మాత్రం నిరాశపరచింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మిక ధనుష్ తో కుబేర సినిమా చేస్తుంది. ఆ సినిమాతో పాటు గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. ఐతే రష్మిక తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ తో అలరిస్తుంది. అమ్మడు ప్రస్తుతం తన ఇన్ స్టా స్టేటస్ లో ఊటీలో కొన్నాళ్లు ఉంటానని మెసేజ్ పెట్టింది. మరి రష్మిక షూటింగ్ కోసం అక్కడికి వచ్చిందా లేదా సమ్మర్ కాబట్టి హాలీడేస్ ఇక్కడ ఎంజాయ్ చేద్దామని వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది.
రష్మిక నటిస్తున్న కుబేర సినిమా జూన్ లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తో పాటు ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా ఇయర్ లోనే వచ్చేలా ఉంది. ఐతే కొత్తగా రష్మిక మరో రెండు సినిమాలకు సైన్ చేసిందని టాక్. సో రష్మిక నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ అదరగొట్టేస్తుంది. కేవలం పాన్ ఇండియా సినిమాలే కాదు తెలుగులో కొన్ని కాంబినేషన్స్ లో సినిమాలు చేయాలని రష్మిక ఫ్యాన్స్ కోరుతున్నారు. రష్మిక మాత్రం చేతినిండా సినిమాలతో సక్సెస్ ఫుల్ కెరీర్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది.