ఫోటో స్టోరి: రష్మిక ది రెబల్
ఇప్పుడు రష్మిక మందన్న కొత్త లుక్ సంథింగ్ స్పెషల్ గా వెబ్ లో దూసుకెళుతోంది.
By: Tupaki Desk | 6 July 2025 11:11 AM ISTప్రతిభను ఎవరూ ఆపలేరు.. ప్రతిభావంతుల ఎదుగుదలకు ఎదురేలేదు. ఈ కోవకే చెందుతుంది రష్మిక మందన్న. కన్నడ సినిమాలో చిన్నగా మొదలై టాలీవుడ్ లో అగ్ర నాయికగా ఎదిగి, ఇప్పుడు బాలీవుడ్ లో లక్కీ ఛామ్ గా ఏల్తోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ సక్సెస్ ని కేరాఫ్ గా మార్చుకున్న ఈ బ్యూటీ ఏం చేసినా అది ట్రెండ్ గా మారుతోంది.
ఇప్పుడు రష్మిక మందన్న కొత్త లుక్ సంథింగ్ స్పెషల్ గా వెబ్ లో దూసుకెళుతోంది. లెదర్ సోఫా.. పచ్చ-నలుపు రంగు ఫుల్ స్లీవ్స్ టీషర్ట్, దానిపై స్టైలిష్ కోట్, లేస్ ముడి వేయని వైట్ షూస్ ని ధరించి రియల్ రెబల్ ని తలపిస్తోంది. అందంలోనే కాదు ఫ్యాషన్ సెన్స్ లోను తనను కొట్టేవాళ్లే లేరని రష్మిక నిరూపిస్తోంది. బాలీవుడ్ టు టాలీవుడ్ నటవారసులు ఎందరు ఉన్నా వీళ్లెవరూ తన ముందు నిలబడలేరు! అని సవాల్ విసురుతోంది.
బాలీవుడ్ లో జాన్వీకపూర్, ఖుషి కపూర్, సుహానా ఖాన్, అనన్య పాండే, సారా అలీఖాన్ .. ఇలా చాలా మంది నటవారసురాళ్లు ఉన్నారు. కానీ వీళ్లలో ఎవరికీ లేని స్టార్ డమ్ రష్మిక మందన్నకు ఉంది. అందానికి అందం, అభినయం, సక్సెస్, అదృష్టం అన్ని కోణాల్లో రష్మికకు ఎదురే లేదు. ఇప్పుడు ఫ్యాషన్ సెన్స్ లోను వీళ్లెవరూ తన ముందు దిగదుడుపేనని నిరూపించే పనిలో ఉంది. రష్మిక ఇటీవల కుబేర చిత్రంలో నటించింది. తదుపరి థామ, ది గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాల్లో నటించింది. ఇవన్నీ విడుదలకు రావాల్సి ఉంది.
