Begin typing your search above and press return to search.

కుబేర ఈవెంట్ లో కొత్త రష్మిక..!

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక తన లుక్స్ తో ఆకట్టుకుంది. ఐతే స్పీచ్ లో భాగంగా తన ఏవీ చేసుకున్న రష్మిక తను ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతుందా అని నమ్మలేకపోతున్నా అని అన్నది.

By:  Tupaki Desk   |   16 Jun 2025 9:43 AM IST
కుబేర ఈవెంట్ లో కొత్త రష్మిక..!
X

ధనుష్ హీరోగా నటించిన కుబేర సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయగా సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. లేటెస్ట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చిత్ర యూనిట్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో రష్మిక స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది.

కుబేర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక తన లుక్స్ తో ఆకట్టుకుంది. ఐతే స్పీచ్ లో భాగంగా తన ఏవీ చూసుకున్న రష్మిక తను ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతుందా అని నమ్మలేకపోతున్నా అని అన్నది. శేఖర్ కమ్ముల గారితో చేయడం సంతోషంగా ఉంది. నాగ్ సార్ తో మంచి రిలేషన్ ఉందని ఆయనతో రెండో సారి పని చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు రష్మిక. ఇక ధనుష్ తో ఫస్ట్ టైం చేశా.. ఇది స్టార్టింగ్ మాత్రమే.. చాలా సినిమాలు చేయాలని కోరుతున్నా అన్నారు రష్మిక.

స్పీచ్ లో భాగా అభిమానుల కేరింతలకు రష్మిక కూడా అదే రేంజ్ లో రెస్పాండ్ అయ్యారు. అంతేకాదు ఈమధ్య జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ చూశాక స్టన్ అయ్యానన్న రష్మిక తాను ఎక్కువగా ఫ్లైట్ జర్నీలు చేస్తుంటా.. ఆ యాక్సిడెంట్ చూశాక బాధ కలిగింది. మ లైఫ్ చాలా సింపుల్ ఎప్పుడు ఏం జరుగుతందో తెలియదు.. ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి హ్యాపీగా ఉండాలని అన్నారు రష్మిక.

ఐతే రష్మిక ఎప్పుడు చాలా జోవియల్ గా మాట్లాడుతుంది కానీ ఇలా జీవితం గురించి చెప్పడం మాత్రం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. కుబేర సినిమా మీద రష్మిక చాలా కాన్ ఫిడెంట్ గా ఉంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.