Begin typing your search above and press return to search.

రష్మిక ఫ్యాన్స్‌కి టెన్షన్‌ టెన్షన్‌...!

రణబీర్‌ కపూర్‌ 'యానిమల్‌', అల్లు అర్జున్‌ 'పుష్ప 2', విక్కీ కౌశల్‌ 'ఛావా' సినిమాల్లో నటించడం ద్వారా రష్మిక మందన్న రికార్డ్‌లను సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   11 Jun 2025 3:00 PM IST
రష్మిక ఫ్యాన్స్‌కి టెన్షన్‌ టెన్షన్‌...!
X

రణబీర్‌ కపూర్‌ 'యానిమల్‌', అల్లు అర్జున్‌ 'పుష్ప 2', విక్కీ కౌశల్‌ 'ఛావా' సినిమాల్లో నటించడం ద్వారా రష్మిక మందన్న రికార్డ్‌లను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్‌ మూడు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌లను సొంతం చేసుకోవడంతో రష్మిక మందన్న గురించి జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా కథనాలు వచ్చాయి. మూడు సినిమాలతో మూడు వేల కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుందని అభిమానులు తెగ హడావిడి చేశారు. ఆ మూడు సినిమాలతో రష్మిక క్రేజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరిగింది. కానీ సల్మాన్‌ ఖాన్‌తో నటించిన సికిందర్‌ సినిమా ఆమెకు దారుణమైన డిజాస్టర్‌ను కట్టబెట్టింది. ఆ సినిమా ఇప్పటికప్పుడు రష్మిక కెరీర్‌ను పెద్దగా ఎఫెక్ట్‌ చేయక పోవచ్చు. కానీ ఫ్యూచర్‌లో సమస్యగా ఉండవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రష్మిక ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాలపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈమె నటించిన 'కుబేర' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ధనుష్ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'కుబేర' సినిమా ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో రష్మిక పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడంతో తమిళ్‌తో పాటు, తెలుగు భాషలోనూ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక పుష్ప 2 సినిమా తర్వాత రష్మిక మందన్న నుంచి రాబోతున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కుబేర సినిమా మాత్రమే కాకుండా రష్మిక నటించిన గర్ల్‌ ఫ్రెండ్‌, థమ సినిమాలు సైతం ఇదే ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రూపొందిన గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ మధ్య విడుదలైన టీజర్‌కి మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్‌కు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకే ఎప్పుడు ఆ సినిమా వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్మిక నటిస్తున్న ఈ మూడు సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉండగా, కొన్ని షూటింగ్‌ దశలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆ సినిమాలు ఈ ఏడాదిలో విడుదల కావు, కనుక ఈ ఏడాదిలో విడుదల కాబోతున్న కుబేర, ది గర్ల్‌ ఫ్రెండ్‌, థమ సినిమాలపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో సల్మాన్‌ ఖాన్‌తో నటించిన సికిందర్‌ సినిమాతో వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్‌ కావడంతో ఈ ఏడాదిలో రాబోతున్న సినిమాలు హిట్‌ కావాల్సి ఉంది. మూడు సినిమాల్లో కనీసం రెండు సినిమాలు అయినా హిట్‌ అయితేనే రష్మిక కెరీర్‌ సాఫీగా సాగుతుంది. అందుకే అభిమానులు ఈ సినిమాల ఫలితం విషయంలో టెన్షన్‌ టెన్షన్‌గా ఉన్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రష్మిక సైతం తన సినిమాల ఫలితం విషయంలో ఒకింత ఆందోళనలో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే ఆమె నుంచి మరిన్ని సూపర్‌ హిట్‌లు రావాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.