నేషనల్ క్రష్ చిట్టి చెల్లెలు..భవిష్యత్ లో హీరోయిన్!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పరిచయం అవసరం లేని పేరు. పాన్ ఇండియాలో అమ్మడిప్పుడో సంచల నం. వరుస విజయాలతో ఓ బ్రాండ్ గా మారింది.
By: Tupaki Desk | 6 Aug 2025 1:00 AM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా పరిచయం అవసరం లేని పేరు. పాన్ ఇండియాలో అమ్మడిప్పుడో సంచలనం. వరుస విజయాలతో ఓ బ్రాండ్ గా మారింది. తెలుగు, హిందీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా? రష్మిక మాత్రం సంథింగ్ స్పెషల్ గా మార్కెట్ లో వెలిగిపోతుంది. స్టార్ హీరోలే అమ్మడితో కలిసి నటించడానికి క్యూ కడుతున్నారు. భవిష్యత్ లో మరిన్ని శిఖరాలను అధిరోహించడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. మార్కెట్ కు తగ్గట్టు పారితోషికంగా భారీగానే అందుకుంటుంది. కెరీర్ పరంగా కొన్నాళ్ల పాటు చూసుకునే పనిలేదు. ఇక ఖాళీ సమయం దొరికిందంటే కుటుంబంతో అంతే ఆస్వాదిస్తుంది. మామ్ -డాడ్ తో ఉన్న వీడియోలను నెట్టింట పోస్ట్ చేస్తుంది. అయితే ఈ అమ్మడికి ఓ చిట్టి చెల్లెలు ఉందన్నది? పెద్దగా ఎవరికీ తెలియదు. చిట్టి చెల్లెలు అంటే ఏకంగా మేక పిల్ల ఎక్కించుకుని మరీ తిప్పేంత చెల్లెలు ఉంది? అన్నది ఇప్పుడే బయటకు వచ్చింది.
రష్మిక వయసు 29 సంవత్సరాలు కాగా...చెల్లితో వయసు వ్యత్యాసం 16 ఏళ్లు ఉంది. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా తెలిపింది. ఆ చిట్టి చెల్లి పేరు షీమన్. చెల్లెలు రష్మికకు తల్లితో సమానంగా భావిస్తుంది. తన అవసరాలన్ని అక్కగా తానే చూసుకుంటుంది. చెల్లి ఏం కోరుకున్నా క్షణాల్లో తెచ్చి ముందు పెట్టేంత ప్రేమ అక్కలో ఉంది. ఇప్పటి వరకూ చెల్లికి ఇచ్చిన బహుమతులు ఎన్నో. అలాగని అనవసరమైన వస్తువులు కోరితే మాత్రం కొననంటోంది. అది అవసరమా? కాదా? అన్నది నిర్దారించుకున్న తర్వాతే దానిపై ఖర్చు పెడతానంటోంది.
షీమన్ కి కూడా అక్కలాగే సినిమాలంటే ఆసక్తి ఎక్కువే. పెద్దాయ్యాక హీరోయిన్ అవుతానని చెప్పిందిట. రష్మిక కూడా అందుకు తన నుంచి అన్నిరకాల సహాయం అందుతుందని భరోసా కల్పించిందిట. చదు వులో కూడా షీమన్ ముందుంటుందని...తెలివైన పిల్లగానే చెప్పుకొచ్చింది రష్మిక. అలాగే ఇంటిల్లాపాది కలిసి చూసింది నాలుగు సినిమాలేనట. రష్మిక ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నటిగా బిజీ అవ్వడంతో కుటుంబంతో కలిసి సినిమా చూసే సమయం లేకుండాపోయిందని తెలిపింది.
