ఊహించని జీవితం ఎంతో అద్భుతంగా!
హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందం..అభినయం...ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోవు.
By: Tupaki Desk | 4 Jun 2025 8:33 PM ISTహీరోయిన్ గా సక్సెస్ అవ్వాలంటే అందం..అభినయం...ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోవు. ఆ మూడింటికి అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యేది. అనుకున్న గమ్యాన్ని చేరుకునేది. కొందరు ఎలాంటి గోల్స్ లేకుండానే వచ్చి సక్సుస అవుతుంటారు. ఊహించని జీవితాన్ని చూస్తుంటారు. అలాంటి వాళ్లలో రష్మిక మందన్న ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎందుకంటే తాను ఏమాత్రం ఊహించని గొప్ప జీవితం తనకు దక్కిందని అమ్మడు గుర్తు చేసుకుంది. `కూర్గ్` అనే ఓ చిన్న ప్రాంతం నుంచి వచ్చిన తాను ఇంత గొప్ప నటిగా దేశ ప్రజల నీరాజనాలు అందుకుం టానని ఏ నాడు ఊహించలేదని తెలిపింది. కనీసం కలలో కూడా ఎప్పుడు కూడా అలాంటి జీవితాన్ని ఊహించుకోలేదంది. చదవు... ఆ తర్వాత మంచి ఉద్యోగం తప్ప ఇంకెలాంటి ఆలోచనలు లేకుండా ఉన్న తన జీవి తం ఇంత గొప్ప ఉంటుందని ఎన్నడు అనుకోలేదంది.
అంతేగా `ఛలో` అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు అటుపై నేషనల్ క్రష్ గా మారింది. అక్కడ నుంచి `పుష్ప` , `యానిమల్` లాంటి విజయాలతో ఏకంగా పాన్ ఇండియాకి రీచ్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్గా వెలిగిపోతుంది. కోట్లాది రూపాయలు పారితోషికం తీసు కుంటుంది. ఖరీదైన జీవితం..కార్లు.విల్లాలు.... స్పెషల్ జెట్ లు. వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ రష్మిక హీరోయిన్ అయిన తర్వాత సంపాదించిన ఆస్తులే కదా. అంత ఆస్తి సంపాదిస్తుందని తాను ఏనాడు ఊహించలేదు. ఇంతకు మించిన అదృష్టవంతురాలు ఇండస్ట్రీలో ఎవరుంటారు. రష్మికను సినిమాల్లోకి తీసుకోచ్చింది కన్నడ నటుడు రక్షిత్ శెట్టి. అతడితో కొన్నాళ్ల పాటు ప్రేమాయణం కూడా సాగిం చింది. అటుపై తాను పెద్ద స్టార్ అయిన తర్వాత ఆ ప్రేమకు పుల్ స్టాప్ పడిన సంగతి తెలిసిందే.
