Begin typing your search above and press return to search.

కాల్ మీ ఫ్యాబ్ అంటున్న నేషనల్ క్రష్..!

వరుస సక్సెస్ లతో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇంపాక్ట్ చూపిస్తున్న అమ్మడు ఇదే ఫాం ని మరికొన్నాళ్లు కొనసాగించేలా ప్లాన్ చేస్తుంది.

By:  Tupaki Desk   |   22 April 2025 5:20 PM
కాల్ మీ ఫ్యాబ్ అంటున్న నేషనల్ క్రష్..!
X

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏం చేసినా అదో సెన్సేషన్ అవుతుంది. వరుస సక్సెస్ లతో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇంపాక్ట్ చూపిస్తున్న అమ్మడు ఇదే ఫాం ని మరికొన్నాళ్లు కొనసాగించేలా ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్స్ అందుకోవడం తో అమ్మడికి నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఏర్పడింది. మరే సౌత్ హీరోయిన్ కి ఈ రేంజ్ క్రేజ్ పాపులారిటీ ఈమధ్య కాలంలో రాలేదని చెప్పొచ్చు.

అందుకే రష్మిక జస్ట్ అలా కనిపిస్తే చాలు సెన్సేషన్ అయ్యేలా పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో తన క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు చాలా బ్రాండ్ లు వెంట పడుతున్నాయి. ఇప్పటికే రష్మిక చేతిలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సినిమాలతోనే కాదు ఆ ప్రకటనలతో రష్మిక రెగ్యులర్ గా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటుంది.

ఐతే కొత్తగా రష్మిక ఒక కొత్త ఫోన్ బ్రాండ్ కి బ్రాండింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే రష్మిక తన సోషల్ మీడియాలో కాల్ మీ ఫ్యాబ్ అంటూ ఒక మిర్రర్ సెల్ఫీతో హంగామా చేస్తుంది. చేతిలో సెల్ ఫోన్ తో కలర్ ఫుల్ గా రెడీ అయిన రష్మిక కాల్ మీ ఫ్యాబ్ అంటూ కొత్త ఫోన్ యాడ్ లో కనిపిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్ సంగతేమో కానీ రష్మిక చేతిలో పడటం వల్ల ఆ ఫోన్ కే అందం వచ్చింది.

రష్మిక ఫ్యాన్స్ అర్జెంట్ గా ఆ ఫోన్ డీటైల్స్ తెలుసుకుని ఆర్డర్ పెట్టేయాలన్నంత ఊపు వచ్చేలా చేసింది. రష్మిక కాల్ మీ ఫ్యాబ్ అనడం ఏమో కానీ ఆ ఫోన్ డీటైల్స్ కోసం వెతకడం పనిగా పెట్టుకున్నారు ఆమె ఫ్యాన్స్.

ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కుబేర, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తున్న అమ్మడు బాలీవుడ్ లో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు సైన్ చేసినట్టు తెలుస్తుంది. నేషనల్ క్రష్ ఇమేజ్ మాత్రమే కాదు నేషనల్ లెవెల్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా అదరగొట్టేస్తుంది అమ్మడు. సినిమాలే కాదు వాణిజ్య ప్రకటనలతో కూడా రష్మిక ఒక రేంజ్ లో దూసుకెళ్తుంది. యాడ్స్ లో కూడా తన రేంజ్ ఏంటన్నది చూపిస్తుంది అమ్మడు.