బీఏ సెకెండ్ ఇయర్ లో రష్మిక ఆడిషన్!
ప్రతిభావంతులు చాలా మంది ఉన్నా? ఆ ప్రతిభ కు అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి.
By: Tupaki Desk | 8 Jun 2025 9:00 PM ISTనేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియాలో గొప్ప సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ అంటూ మూడు భాషల్లోనూ బిజీగా ఉంది. ప్రత్యేకంగా బాలీవుడ్ కెరీర్ పై దృష్టి పెట్టి సినిమాలు చేస్తోంది. ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం అందుకుంటుంది. తన కెరీర్ ఇంత గొప్ప టర్నింగ్ తిరుగుతుందని తాను కూడా ఊహించలేదు. అదృష్టం అంటే ఇలా కలిసి రావాలని తోటి నాయికలంతా అనుకునేంత గొప్పగా సక్సెస్ అయింది.
ప్రతిభావంతులు చాలా మంది ఉన్నా? ఆ ప్రతిభ కు అదృష్టం కూడా తోడవ్వాలి. అప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి. వచ్చే రెండేళ్లలో రష్మిక ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అవుతుం దనే అంచనాలు బలంగా ఉన్నాయి. అలాంటి క్రేజీ బ్యూటీ బీఏ సెకెండ్ ఇయర్ లోనే ఆడిషన్ కు వెళ్లింది? అన్న సంగతి ఎంత మందికి తెలుసు. అవును ఈ విషయాన్ని రష్మిక స్వయంగా రివీల్ చేసింది.
అమ్మడు డిగ్రీ చదువుతున్నప్పుడే ఓసాధారణ అమ్మాయిగా ఆడీషన్ కు వెళ్లిందిట. అప్పుడు అమ్మడి వయసు 19 ఏళ్లు. కానీ ఆ యవసులో కూడా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా పాల్గొన్నట్లు తెలిపింది. సాధార ణంగా ఎవరికైనా తొలిసారి కెమెరా ఫేస్ చేయాలంటే కంగారు ఉంటుంది. కానీ రష్మిక లో కంగారుగానీ, ఒత్తిడి గానీ ఎదుర్కోలేదంది.
అయితే అక్కడ తనని తాను పరిచయం చేసుకునే సమయంలో డైలాగులు చెప్పే మయంలో, డాన్సు చేస్తున్పప్పుడు మాత్రం చెప్పలే నంత ఆందోళనకు గురైనట్లు గుర్తు చేసుకుంది. ఆ సమయంలో మళ్లీ ఎలాంటి ఆడిషన్లకు వెళ్ల కూడదనుకుందంట. కానీ ఇప్పుడు తానే హీరోయిన్లకు ఆడిషన్లు నిర్వహించే స్థాయికి వెళ్లింది. మోడలింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత `కిరిక్ పార్టీ`లో రక్షిత్ శెట్టి అవకాశం ఇచ్చాడు.
