రష్మిక మరో బిగ్ స్టెప్.. ఎప్పుడు రివీల్ చేస్తుందో..
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ లో ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వరుస సినిమాల్లో నటిస్తున్న అమ్మడు.. అదే సమయంలో హిట్స్ కూడా అలాగే అందుకుంటోంది.
By: Tupaki Desk | 21 July 2025 11:25 AM ISTస్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కెరీర్ లో ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వరుస సినిమాల్లో నటిస్తున్న అమ్మడు.. అదే సమయంలో హిట్స్ కూడా అలాగే అందుకుంటోంది. బ్లాక్ బస్టర్ సినిమాలతో అందరినీ మెప్పిస్తున్న రష్మిక.. మరిన్ని సినిమాల్లో ఛాన్స్ లు సొంతం చేసుకుని సత్తా చాటుతోంది.
మొత్తానికి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బిజీగా ఉన్న ఆమె.. షూటింగ్స్ తో తీరిక లేకుండా గడుపుతుందనే చెప్పాలి. ఇప్పుడు సౌత్ టు నార్త్.. అనేక ఆఫర్స్ ఆమె చేతిలోనే ఉన్నాయి. అలా తక్కువ టైమ్ లో ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నట్లే ఉంది. అదే సమయంలో ఇప్పుడు రష్మిక మందన్న వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది.
ఆ విషయాన్ని ఆమెనే చెబుతూ పోస్ట్ చేసిన వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తొలుత ఓ వీడియో షేర్ చేస్తూ.. "నేను చివరకు దీన్ని రికార్డ్ చేస్తున్నానని నేను నమ్మలేకపోతున్నాను. మీకు ఇప్పటికే తెలిసినట్లుగా, నేను నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న దానిపై పని చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
"మీరు దానిని అనుభవిస్తారని నేను ఆశిస్తున్నాను, మీరు దానిని ఇష్టపడతారని నేను ఆశిస్తున్నాను. దానిని మీతో పంచుకోవడానికి వేచి ఉండలేను. చాలా చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఆందోళనగా ఉన్నాను. కృతజ్ఞతతో ఉన్నాను" అని చెప్పిన రష్మిక.. ఆ తర్వాత తన తల్లితో జరిగిన సంభాషణ వీడియోను పోస్ట్ చేసింది.
అందులో రష్మిక "నేను ఇప్పుడు చాలా ముఖ్యమైన షూట్ కు వెళ్తున్నాను. మీరు చెప్పిన వ్యాపారాన్ని నేను ప్రారంభిస్తాను" అని తల్లితో చెప్పగా.. ఆమె బెస్ట్ విషెస్ చెబుతారు. అయితే రష్మిక ఏ బిజినెస్ స్టార్ట్ చేయనుందో వెల్లడించలేదు. ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు.
కాగా, ఇప్పటికే అనేక మంది స్టార్ హీరోయిన్స్.. సొంత ఫ్యాషన్ బ్రాండ్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తమ బిజినెస్ తో రాణిస్తున్నారు. ఇప్పుడు రష్మిక కూడా వారి బాటలోనే వెళ్తున్నారని తెలుస్తోంది. ఆ విషయాన్నే అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మరి చూడాలి రష్మిక ఏ బిజినెస్ స్టార్ చేస్తారో..
