Begin typing your search above and press return to search.

సెలబ్రేషన్ లో మునిగిన నేషనల్ క్రష్!

ఈరోజు (ఏప్రిల్ 5) నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు. ఇండస్ట్రీలో తనదైన స్టైల్ తో, ఎనర్జీతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు 29వ వసంతంలోకి అడుగుపెట్టింది.

By:  Tupaki Desk   |   5 April 2025 9:57 AM IST
Rashmika Turns 29 with Style & Smiles
X

ఈరోజు (ఏప్రిల్ 5) నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు. ఇండస్ట్రీలో తనదైన స్టైల్ తో, ఎనర్జీతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు 29వ వసంతంలోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మిక, ఈసారి కూడా తన బర్త్‌డే ఎనౌన్స్‌మెంట్‌ను ఫుల్ జోష్‌తో చేసింది. పుట్టినరోజు నెల వచ్చేసింది… ఎంతో హ్యాపీగా పెరుగుతున్నా, ఈసారి కూడా హ్యాపీగా, హెల్తీగా ఉండగలిగాను.. అంటూ రష్మిక పోస్ట్ చేయడం ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేసింది.

ఇక తన బర్త్‌డే ముందు ఓ హాలిడే ట్రిప్ కూడా ప్లాన్ చేసింది రష్మిక. ఓమన్‌లోని సలాలా అనే ప్రాంతానికి వెళ్లిన ఈ బ్యూటీ, అక్కడి సన్‌, సాండ్‌, స్మైల్స్‌తో పాటు మంచి ఫుడ్‌ను కూడా ఆస్వాదించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో అద్భుతమైన భోజనం + ఫుల్ హ్యాపీ టమ్మీ = కోపంగా ఉన్న ట్రైనర్స్.. అంటూ ఫన్నీగా రాసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత ఫ్యాన్స్‌కి రష్మిక ఫిట్‌నెస్ ట్రైనర్ల ఫీల్‌ కూడా అర్థమైపోయింది.

ట్రిప్‌లో భాగంగా స్విమ్మింగ్ పూల్ పక్కన బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టైలిష్ హ్యాట్‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సింపుల్‌గా అయినా క్లాస్‌గా కనిపించిన ఆమె స్టన్నింగ్ లుక్స్‌పై నెటిజన్ల కామెంట్లు వస్తూనే ఉన్నాయి. పుట్టినరోజు ముందు ఇలా ఫుల్ హ్యాపీగా కనిపించిన రష్మిక, తన పర్సనల్ లైఫ్‌ను ఎంత బలాన్స్ చేస్తుందో మరోసారి నిరూపించింది.

ప్రస్తుతం రష్మిక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్ హిట్స్ అందుకున్న హీరోయిన్. యానిమల్, పుష్ప 2, ఛావా.. సినిమాలు వరుసగా బాక్సాఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన నటించిన ‘సికందర్’ విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం భారీ హైప్ క్రియేట్ చేసినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినా రష్మికకు వచ్చిన రెస్పాన్స్ మాత్రం డీసెంట్‌గానే ఉంది.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన కష్టం పట్టుదలతో టాప్‌ ప్లేస్ తోలి వచ్చిన హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ‘చలో’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ, ఆ తర్వాత గీత గోవిందం, డియర్ కామ్రేడ్, సీతారామం వంటి సినిమాలతో తన నటనకు, గ్లామర్‌కి మంచి మార్కులు కొట్టేసింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు. ఒకప్పుడు మోడలింగ్‌లో మొదలైన ఈమె ప్రయాణం, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌కి వచ్చింది. తన 29వ పుట్టినరోజున, రష్మికకు అభిమానుల నుంచి, ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరి రాబోయే సినిమాలతో అమ్మడు ఇంకా ఏ స్థాయిలో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.