రష్మికని మందలించేలా లేరా..?
నేషనల్ క్రష్ రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో ఫుల్ ఫాం లో ఉంది. ఆమె సినిమాలో ఉంది అంటే చాలు సినిమా సూపర్ హిట్ అనే టాక్ ఉంది.
By: Tupaki Desk | 25 April 2025 10:12 AM ISTనేషనల్ క్రష్ రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో ఫుల్ ఫాం లో ఉంది. ఆమె సినిమాలో ఉంది అంటే చాలు సినిమా సూపర్ హిట్ అనే టాక్ ఉంది. అందుకు తగినట్టుగానే వరుస హిట్లు కనిపిస్తున్నాయి. అందుకే రష్మిక కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. మొన్నటిదాకా సౌత్ ప్రొడ్యూసర్స్ కి అందుబాటులో ఉన్న రష్మిక పాన్ ఇండియా లెవెల్ లో పెరిగిన తన క్రేజ్ తో రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్. దాని వల్ల సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాలకు దూరమైందని తెలుస్తుంది.
హిట్లు పడుతుంటే ఎవరైనా రెమ్యునరేషన్ పెంచడం కామన్. అందులో నేషనల్ లెవెల్ లో రష్మిక అందుకుంటున్న హిట్లు వందల కోట్ల కలెక్షన్స్ ఇవన్నీ ఆమె రేంజ్ మరింత పెంచాయి. ఈ క్రమంలో రష్మిక ఇప్పుడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ డిమాండ్ చేస్తుందని టాక్. మొన్నటివరకు సినిమా 6 నుంచి 8 కోట్ల దాకా భారీ రెమ్యునరేషన్ తీసుకుందట రష్మిక.
ఐతే ఇప్పుడు తన దగ్గరకు వస్తున్న మేకర్స్ కి 10 కోట్లు ఇస్తేనే అన్నట్టుగా చెబుతుందట. రష్మిక మందన్న డిమాండ్ కి నిర్మాతలు షాక్ అవ్వకపోగా ఆమె కోరినంత ఇచ్చి మరీ ఆమెను తీసుకోవాలని చూస్తున్నారట. హిట్ ఫాం లో ఉన్న రష్మిక కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందే తప్ప ఆమె రెమ్యునరేషన్ పెద్ద లెక్కేమి కాదనే వారు ఉన్నారు.
మరోపక్క రష్మిక వాణిజ్య ప్రకటనలతో కూడా అదరగొట్టేస్తుంది. ఎలాగు సక్సెస్ ఫాం లో ఉన్నాం కాబట్టి ఆ క్రేజ్ ని కొనసాగించేలా యాడ్స్ లో కూడా నటించేస్తుంది అమ్మడు. ఇలా తన ప్రతి స్టెప్ తో కెరీర్ కి ప్లస్ అయ్యేలా చేసుకుంటూ అదరగొట్టేస్తుంది రష్మిక. ప్రస్తుతం రష్మిక ధనుష్ కుబేరతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ బాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఎంచుకునే పాత్రల్లో రష్మిక తన బెస్త్ ఇస్తూ ఆడియన్స్ ని అలరిస్తుంది. అదీగాక అమ్మడికి కాస్త లక్ కూడా కలిసి వస్తుంది. అందుకే హిందీ లో తను చేసిన సినిమాలు సూపర్ హిట్ అవ్వడమే కాకుండా తెలుగు నుంచి పాన్ ఇండియా రిలీజైన పుష్ప 1, 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యి అమ్మడికి సూపర్ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ఐతే ఈ హిట్ మేనియాను కొనసాగించేలా రష్మిక ప్రయత్నాలు చేస్తుంది.